Day: September 22, 2022

సద్దుల బతుకమ్మ, దసరా పండుగను ఘనంగా నిర్వహించాలి*   *ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

*ప్రెస్ రిలీజ్* *సెప్టెంబర్ 22* *హనుమకొండ:* *సద్దుల బతుకమ్మ, దసరా పండుగను ఘనంగా నిర్వహించాలి* *ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్* గురువారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడానికి అన్నీ చర్యలు. గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ కారణంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించలేకపోయామన్నారు. ఈ సారి భద్రకాళి దేవి నవరాత్రి ఉత్సవాలకు ఎక్కువ సంఖ్యలో భక్తులు…

పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు*.   

*ప్రెస్ రిలీజ్* *హనుమకొండ* *సెప్టెంబర్ 22 *పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు గురువారం నాడు పోడు వ్యవసాయం చేసుకుంటున్న పోడు వ్యవసాయదారులకు సమస్యలు, అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా చేపట్టే సంరక్షణ చర్యలపై జిల్లా కలెక్టర్ సమావేశ మందిరం లో ఏర్పాటుచేసిన సమన్వయసమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్, పలువురు ప్రజాప్రతినిధులు…

పత్రికా ప్రకటన.   తేది:22.09.2022, వనపర్తి. కనాయపల్లి భూ నిర్వాసితులకు పునరావాసాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు. గురువారం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో కనాయపల్లి గ్రామ భూ నిర్వాసితుల సమస్యలపై, పునరావాస కేంద్రాలపై దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముంపు గ్రామాల పునరావాస బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, కానాయపల్లి…

పత్రికా ప్రకటన      తేది:22.09.2022, వనపర్తి త్రాగునీటి సరఫరా, కాలుష్య నియంత్రణ, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, వృద్ధుల, వికలాంగుల సంక్షేమం, నైపుణ్య శిక్షణ, పారిశుద్ధ్యం అభివృద్ధికి అత్యవసర నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవితో కలిసి మంత్రి డి.ఎం.ఎఫ్.టి. సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి…

పత్రికా ప్రకటన     తేది:22.09.2022, వనపర్తి. అక్టోబరు 5వ తేదిన నిర్వహించనున్న దసరా పండగను సంతోషంగా జరుపుకొనుటకు ఆడ పడుచులకు ప్రభుత్వ కానుకగా బ‌తుక‌మ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. గురువారం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 8, 9వ. వార్డులు మర్రికుంట కాలనీలో మంత్రి బతకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్ర‌తి ఆడపడుచు బ‌తుక‌మ్మ పండుగ‌ను సంతోషంగా జరుపుకోవాలన్న…

పత్రికా ప్రకటన      తేది:22.09.2022, వనపర్తి. ఈ నెల 28వ తేదీన ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులకు హెచ్.సి.ఎల్, ఎం.ఎన్.సి. ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్బాన్ సూచించారు. గురువారం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో జాబ్ మేళాపై ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల అధ్యాపకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020-21 సం.ము, 2021-22 విద్య సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ 2వ…

పత్రికా ప్రకటన    తేది:22.09.2022, వనపర్తి. అటవీ సంరక్షణ, పునర్జీవనానికి శాశ్వత పరిష్కారం కల్పించేందుకు, చాలా కాలంగా పోడు భూములను సాగుచేస్తూ, అటవీ హక్కు పత్రాలు పొందని గిరిజన, గిరిజనేతరులకు న్యాయం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. గురువారం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో పోడు భూములపై సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 28,343.44…

పత్రికా ప్రకటన      తేది:22.09.2022, వనపర్తి. 2022-23 సం.నికి బెస్ట్ అవైలబుల్ పాఠశాల (ప్రతిభ, హై స్కూల్, వనపర్తి) లో 1వ. తరగతి ప్రవేశానికి ఎస్.సి. కులానికి చెందిన విద్యార్థుల నుండి దరఖాస్తులను స్వీకరించుటకు చివరి తేది ఈ నెల 22వ. తేది నుండి 26వ తేది వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ అధికారిని నుషిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకొనుటకు వనపర్తి జిల్లా వాసులై ఉండాలని,…

ప్రచురణార్థం   ఖమ్మం, సెప్టెంబర్ 22: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు ఆడ పడుచులకు ప్రభుత్వం చీరెలను సారెగా అందించడం గర్వకారణమని, పువ్వులను పూజించే సంస్కృతి మన రాష్ట్రంలో ఉందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరెల పంపిణీలో భాగంగా గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలో మంత్రి చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. ఖమ్మం నగరంలోని శాంతి నగర్ ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల,…

తెలంగాణ విజయ డెయిరీ ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి ప్రకటించారు. గురువారం NTR పార్క్, లుంబినీ పార్క్ లలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ ఐస్ క్రీమ్ పార్లర్ లను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, MLC బస్వరాజు సారయ్య, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ …