Day: September 28, 2022

  తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పండుగ బతకమ్మ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ 000000    ఆనందాలను, ఆప్యాయతలను పంచడమే కాకుండా విలువలకు అద్దం పడుతుంది బతకమ్మ పండగ అని అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. బుధవారం రాత్రి జ్యోతిబా పూలే( సర్కస్ గ్రౌండ్)లో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష బతకమ్మలో ఆమె పాల్గొన్నారు. జడ్పి సిఈఓ డిఆర్డిఓ ,డిఎమ్ హెచ్ఓ,డిడబ్ల్యుఓ లతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె…

అక్టోబర్ లో  జిల్లాస్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం

అక్టోబర్ లో జిల్లాస్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం 15- 29 సంవత్సరాల లోపు గ్రామీణ/ పట్టణ యువతీ, యువకులు మరియు విద్యార్థిని, విద్యార్థులకు కవిత్వం, పెయింటింగ్, మొబైల్ ఫోటోగ్రఫీ, ఉపన్యాస పోటీలు, సాంస్కృతిక పోటీలు( డాన్స్) పోటీలు జిల్లా స్థాయి యువజన సమ్మేళనం జిల్లా యువజన అధికారి యం. వెంకట రాంబాబు 0000000 నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో వచ్చేనెల అక్టోబర్ రెండవ వారంలో జిల్లాస్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి ఎం…

వరంగల్ పూలను పూజించడం గొప్ప సంప్రదాయం :: జిల్లా కలెక్టర్ గోపి దేశం లో ప్రతీ చోట పూలతో పూజలు చేస్తారని… కానీ ఒక్క తెలంగాణ లోనే బతుకమ్మ ఆట ద్వారా పూలను పూజించే గొప్ప సంప్రదాయం ఉంది అని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు బుధవారం వరంగల్ కలెక్టరెట్ లో బతుకమ్మ సంబురాలని జిల్లా కలెక్టర్ గోపి ఆదేశాల మేరకు నిర్వహించారు ఈ బతుకమ్మ ఆటలో వివిధ శాఖలకు చెందిన మహిళ ఉద్యోగినులు వివిధ రకాల…

  మానవ తప్పిదాల వల్లే దాదాపు 91శాతం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, చిన్నపాటి నియంత్రణతో ఇలాంటి ప్రమాదాల నుండి తప్పించుకునే అవకాశం ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం ఆధునీకరించి, పునరుద్ధరించిన పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో జాతీయ రహదారుల ప్రమాదాలు గత సంవత్సరంతో పోల్చితే…

  ప్రజలకు నాణ్యమైన, సత్వర సేవలు ఒకే దగ్గర అందించాలని, పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవనం నిర్మాణ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనసాగుతున్న పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు పూర్తికి వచ్చాయని,…

సమాచార హక్కు చట్టం సామాన్యుని చేతిలో వజ్రాయుధం లాంటిదని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ డా. గుగులోతు శంకర్ నాయక్ అన్నారు. బుధవారం డిపిఆర్ సి భవనంలో ఖమ్మం జిల్లా కేంద్రంగా సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడిగిన పౌరులు, పౌర సమాచార అధికారులతో 30 కేసులకు సంబంధించి విచారణను కమీషనర్ నిర్వహించారు. సమాచార హక్కుచట్టం సెక్షన్ 6(1) ప్రకారం ప్రజలు కోరిన సమాచారాన్ని, సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజులలో అందించాల్సిన బాధ్యత…

DPRO ADB- పంటల సాగుకు లాభసాటి సలహాలు అందించాలి- అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్.

రైతులు పండించే పంటల సాగుకు, దిగుబడికి లాభసాటి సలహాలు, సూచనలు సకాలంలో అందించాలని అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరం లో వ్యవసాయ శాఖ క్షేత్ర అధికారులకు శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమాన్ని ముఖ్య ప్రణాళిక శాఖ ద్వారా నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు పండించే పంటలలో సమస్యలు తలెత్తకుండా వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది పంటల సాగు సమయంలోనే అందించాలని, పంటల సాగులో పాటించాల్సిన మెళుకువలు,…

అక్టోబర్ 2 వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు తెలిపారు. బుధవారం గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న పనులను, బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. మంత్రుల వెంట MAUD స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, DME రమేష్ రెడ్డి, కలెక్టర్ అమయ్ కుమార్, ఆసుపత్రి…

తెలంగాణ పల్లెల్లో పుట్టిన బతుకమ్మ పండుగను నేడు దేశ విదేశాలలో నిర్వహిస్తున్నారని, ఇది మనకెంతో గర్వకారణం అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం నెక్లెస్ రోడ్ లోని కర్బలా మైదానంలో గల బతుకమ్మ ఘాట్ ను వివిధ శాఖల అధికారులతో సందర్శించి అక్టోబర్ 3 వ తేదీన సద్దుల బతుకమ్మ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త లపై అధికారులకు…

ఓటర్ హెల్ప్ లైన్ మోబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొండి

18 సంవత్సరాలు నిండిన యువతీయువకులందరు తమ యొక్క వివరాలను ఓటర్ మోబైల్ హెల్ప్ లైన్ యాప్ నందు నమోదు చేసి ఓటర్ గా నమోదు చేసుకోవాలని స్వీప్ నోడల్ అధికారి B. లక్ష్మణ్ అన్నారు. బుధవారం స్థానిక వాగ్దేవి ఆర్ట్స్ & సైన్స్ డిగ్రీ కళాశాలలో ఓటర్ అవగాహన సదస్సుకు ఆయన హజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇప్పటికే ఓటర్ గా నమోదైనవారు ఓటర్ మోబైల్ హెల్ప్ లైన్ యాప్ లో ఫారం నంబర్- 6B ద్వారా…