Day: October 1, 2022

రవీంద్రభారతిలో31వ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన.. మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ వంద సంవత్సరాలు పైబడిన వృద్ధులను సన్మానించిన మంత్రులు వృద్ధుల హెల్ప్ లైన్ నెంబర్ 14567 పోస్టర్ ను అవిష్కరణ   అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముఖ్యంగా వయో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడవద్దన్న మంచి…

గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన 16 ఫీట్ల మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరిస్తారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం MG రోడ్ లోని గాంధీ విగ్రహం జరుగుతున్న అభివృద్ధి పనులు, గాంధీ ఆసుపత్రి ముందు ఏర్పాటు చేస్తున్న 16 ఫీట్ల గాంధీ విగ్రహ పనులను, బహిరంగ సభ జరిగే ఆసుపత్రి ప్రాంగణం లో…

లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం, నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి లే అవుట్ అప్రూవల్ కమిటీ సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ, సుడా పరిధిలో లే-అవుట్ ఆమోదం కొరకై అందిన (14) దరఖాస్తులను కమిటీ సమావేశంలో పరిశీలించారు. నిబంధనల మేరకు సమర్పించబడిన (8) దరఖాస్తులను కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలో…

ఆర్వోఎఫ్ఆర్ చట్టంపై అధికారులు పూర్తి అవగాహన కల్గివుండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం డిపిఆర్సీ భవన సమావేశ మందిరంలో ఎంపిడివోలు, తహశీల్దార్లు, ఎఫ్ఆర్ఓలు, ఎమ్.పి.ఓ., పంచాయతీ కార్యదర్శులకు ఆర్వోఎఫ్ఆర్ చట్టంపై ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షెడ్యూల్ తెగల అటవీ హక్కుల గుర్తింపు బిల్లు 13 డిసెంబర్ 2005 లో లోకసభ లో ప్రవేశపెట్టి, 31 డిసెంబర్ 2007 నుండి చట్టం, 1జనవరి, 2008…

ఆరోగ్య కేంద్రాలలో వారానికి ఒక రోజు వయోవృద్దులకు వైద్యసేవలు

ఆరోగ్య కేంద్రాలలో వారానికి ఒక రోజు వయోవృద్దులకు వైద్యసేవలు ఘనంగా ప్రపంచ వయోవృద్దుల దినోత్సవం జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ 0 0 0 0      జిల్లాలోని అన్ని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వారానికి ఒకరోజు వయోవృద్దులకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.        శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రపంచ వయోవృద్దుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు శిశు, వికాలాంగులు, వయోవృద్దుల సంక్షేమ…

విహార యాత్రకు బయలు దేరిన నాగర్ కర్నూల్  బి.సి. సంక్షేమ శాఖ వసతి గృహ విద్యార్థినిలు

పత్రిక ప్రకటన తేది: 1-10-2022 విహార యాత్రకు బయలు దేరిన నాగర్ కర్నూల్ బి.సి. సంక్షేమ శాఖ వసతి గృహ విద్యార్థినిలు. సమ్మర్ కార్నివాల్ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నాగర్ కర్నూలు జిల్లా బి.సి సంక్షేమ వసతి గృహ విద్యార్థినీలు ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ మొదటి స్థానంలో నిలిచిన సందర్బంగా రాష్ట్ర బి.సి. సంక్షేమ శాఖ ప్రిన్సిపల్…

రైతు ఉత్పత్తి సంఘాలు విజయవంతం అయి ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ముందుగా అలాంటి వ్యాపారం చేస్తున్న సంస్థలను సందర్శించి వ్యాపారం పై అవగాహన పెంపొందించుకోవాలి- జిల్లా కలెక్టర్ -పి.ఉదయ్ కుమార్

పత్రిక ప్రకటన తేది: 1-10-2022 నాగర్ కర్నూల్ జిల్లా. రైతు ఉత్పత్తి సంఘాలు విజయవంతం అయి ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ముందుగా అలాంటి వ్యాపారం చేస్తున్న సంస్థలను సందర్శించి వ్యాపారం పై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సూచించారు. శనివారం ఉదయం నాగర్ కర్నూల్ రైతు వేదికలో రైతు ఉత్పత్తి సంఘాలు, నాబార్డ్ డి.డి.యం, బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారులతో ఈక్విటీ గ్రాంట్ మరియూ క్రెడిట్ గ్యారెంటీ పథకాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్…

వయోవృద్ధులకు సముచిత గౌరవం ఇస్తూ  ఆదరించాల్సిన బాధ్యత వారి సంతానం పై ఉన్నది- జిల్లా పరిషత్ చైర్మన్- పి. పద్మావతి

పత్రిక ప్రకటన తేదీ: 1-10-2022 నాగర్ కర్నూల్ జిల్లా. వయోవృద్ధులకు సముచిత గౌరవం ఇస్తూ ఆదరించాల్సిన బాధ్యత వారి సంతానం పై ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ పి. పద్మావతి అన్నారు. శనివారం ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవాన్ని జిల్లా మహిళాభివృద్ది మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లొ నిర్వహించగా జడ్పి చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దలు ఇంటికి ఒక దీపంలా…

Jan ప్రచురణార్థం వృద్ధుల భాగస్వామ్యం తోనే సమాజాభివృద్ధి… జనగామ అక్టోబర్ 1. సమాజాభివృద్ధిలో వయోవృద్ధులు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని హైదరాబాదు రోడ్డులో ఉన్న విజయ ఫంక్షన్ హాల్ లో అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల వేడుకలను జిల్లా మహిళా శిశు సంక్షేమం దివ్యాంగుల సంక్షేమం వయోవృద్ధుల సంక్షేమం శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు.…

DPRO ADB-బతుకమ్మ వేడుకలను సాంప్రదాయ బద్దంగా మహిళలందరూ నిర్వహించుకోవాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

బతుకమ్మ వేడుకలను సాంప్రదాయ బద్దంగా మహిళలందరూ నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలలో కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత కలెక్టర్ ను బతుకమ్మ లతో కళాశాల యాజమాన్యం, విద్యార్థులు స్వాగతం పలికారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బతుకమ్మలకు సాంప్రదాయ పూజ కార్యక్రమాలు నిర్వహించి బతుకమ్మ ఆటలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలందరూ బతుకమ్మ…