Day: October 12, 2022

ఈ నెల 16న నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలపై అధికారులు వారి వారి విధుల నిర్వహణపై పూర్తి అవగాహన కల్గి, ఎక్కడా ఏ చిన్న పొరపాటు లేకుండా సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం జెడ్పి సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్ లు, లైజన్, అసిస్టెంట్ లైజన్ అధికారులకు కలెక్టర్ పరీక్షల నిర్వహణపై మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ వీడియో కాన్ఫరెన్స్…

బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయాదిత్య భవన్ లో మును గోడ్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నిక నిర్వహణకు నియమించిన పి. ఓ., ఏ.పి. ఓ.లకు ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 3 న నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నవంబర్  2 న న  డి.అర్.సి.కేంద్రాలలో ఉదయం రిపోర్ట్ చేసి పోలింగ్ మెటీరియల్ తీసుకు వెళ్లాలని తెలిపారు. ఓటర్ జాబితా మార్క్డ్ కాపీ,పేపర్ సీల్స్,ఇతర…

DPRO ADB-గ్రూప్ -1 పరీక్ష నిర్వహణకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాం- ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి.

గ్రూప్ -1 పరీక్ష నిర్వహణకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లతో కలిసి గ్రూప్-1 పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై చీఫ్ సూపరింటెండెంట్, లైసన్, సహాయ లైసన్ అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రశ్న పత్రాలు, OMR షీట్ లు ఆయా కేంద్రాలకు తరలించే సమయంలో ఎస్కార్ట్, పరీక్ష కేంద్రాలలో శాంతి భద్రతల పరిరక్షణ, అభ్యర్థుల తనిఖీకి అవసరమైన…

బుధవారం నాడు ఆయన రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ సెక్రటరీ అనితా రామచంద్రన్, సర్వీసు కమిషన్ సభ్యులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, పరీక్షల ఛీప్ సూపరింటెండెంట్లతో ఈనెల 16 న ఆదివారం నాడు నిర్వహించబడే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లను జిల్లాల వారీగా సమీక్షిస్తూ,  పరీక్ష నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, పారిశుద్యం, అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు…

గోళ్లపాడు ఛానల్ పట్టణ ప్రకృతి వనాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్ 3వ టౌన్ పరిధిలో చేపడుతున్న గోళ్లపాడు ఛానల్ పట్టణ ప్రకృతి వనాల అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. పంపింగ్ వెల్ రోడ్, రంగనాయకులు గుట్ట, సుందరయ్య నగర్ లలో చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంపింగ్ వెల్ రోడ్, రంగనాయకులు గుట్ట, సుందరయ్య నగర్…

అక్టోబర్ 16న నిర్వహించు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పకడ్బందీగా నిర్వహించాలి …… టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి

ప్రచురణార్థం అక్టోబర్ 16న నిర్వహించు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పకడ్బందీగా నిర్వహించాలి …… టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి హాల్ టికెట్ లను ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకొని వారు వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి బయో మెట్రిక్ హాజరు దృష్ట్యా ఉదయం 8-30 గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉదయం గం 10-15 ల తర్వాత పరీక్షా కేంద్రంలో అనుమతి ఉండదు హాల్ టికెట్ తో పాటు బ్లూ/బ్లాక్ పాయింట్…

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల సందేహాల నివృత్తికి 7995070702 కు తెలిపి నివృత్తి చేసుకోవాలి….జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల సందేహాల నివృత్తికి కాల్ సెంటర్ ఏర్పాటు….జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ పరీక్షకు సంబంధించి సందేహాలను అభ్యర్థులు 7995070702 ఫోన్ నంబర్ కు తెలిపి నివృత్తి చేసుకోవాలి హాల్ టికెట్ లను ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకొని వారు వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి బయో మెట్రిక్ హాజరు దృష్ట్యా ఉదయం 8-30 గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉదయం గం 10-15 ల తర్వాత పరీక్షా కేంద్రంలో అనుమతి…

బాలికల లక్ష్య సాధనకు సంపూర్ణ సహకారం… జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం బాలికల లక్ష్య సాధనకు సంపూర్ణ సహకారం… జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ మన సమయం, మన హక్కులు , మన భవిష్యత్ అనే థీమ్ పై అవగాహన పెద్దపల్లి, అక్టోబర్- 12: బాలికలు తమ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన సహకారం సంపూర్ణంగా అందజేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన…

DPRO ADB-జిల్లాలో కొత్తగా రెండు ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ కేంద్రాల ఏర్పాటు- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

జిల్లాలో కొత్తగా రెండు ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా లోని గాదిగూడా, బేలా మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున రెండు ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నాబార్డ్ అధికారుల సిఫారసుల మేరకు ఇషాప్…

పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, తప్పనిసరిగా ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి – నారాయణపేట డీఈవో డాక్టర్ గోవిందరాజులు

పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, తప్పనిసరిగా ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి – నారాయణపేట డీఈవో డాక్టర్ గోవిందరాజులు   ధన్వాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ యం. గోవిందరాజులు  ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఆంగ్ల మరియు తెలుగు మధ్యమాల పదవ తరగతి విద్యార్థుల సామర్ధ్యాలను ఆయన పరిశీలించారు. పాఠ్యాంశాల వివరాలను విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవ…