Day: October 17, 2022

మునుగోడు ఉప ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పరిశీలకుల గా వచ్చిన ఐఏఎస్ అధికారి శ్రీ పంకజ్ కుమార్ గారు ఈరోజు చండూరు మండలము లోని తుమ్మలపల్లి, అంగడిపేట గ్రామాల్లో నీ పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వసతులను నల్గొండ రెవిన్యూ డివిజన్ అధికారి శ్రీ జయ చంద్రా రెడ్డి తో కలిసి పరిశలించారు.  వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. బిఎల్ ఓ లతో మాట్లాడి ఓటర్ వివరాలు తెలుసుకున్నారు. చివరలో తుమ్మలపల్లి లో…

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు నమోదు చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు నమోదు చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయులు త్వరలో జరిగే మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో  కోరారు. 1-11-2016 నుండి 31-10-2022 సంవత్సరాల మధ్యలో 3 సంవత్సరాల పాటు అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలలు మరియు…

శివ్వారం వన్యప్రాణుల (మొసళ్ళ) అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ గా రీ నోటిఫై కి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం శివ్వారం వన్యప్రాణుల (మొసళ్ళ) అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ గా రీ నోటిఫై కి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ పెద్దపల్లి, అక్టోబర్ -17: శివ్వారం వన్యప్రాణుల (మొసళ్ళ) అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ గా రీ నోటిఫై కి ప్రతిపాదనలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్…

ప్రచురణార్థం కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ టి.రవీందర్ మంథని ఆర్డీవో కార్యాలయానికి బదిలీ పెద్దపల్లి, అక్టోబర్ -17: సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తహశీల్దార్ / సి సెక్షన్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న టి. రవీందర్ ను మంథని ఆర్డీవో కార్యాలయంలో డి. ఏ. ఓ.గా బదిలీ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. మంథని ఆర్డీవో కార్యాలయంలో డి. ఏ. ఓ.గా పని చేస్తున్న బి. జయశ్రిని…

అంగన్వాడీ సెంటర్లలో పిల్లల హాజరు వందశాతం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.

అంగన్వాడీ సెంటర్లలో పిల్లల హాజరు వందశాతం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.  సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ హాల్లొ స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లాలో పనితీరు పై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ వివరిస్తూ తాను ఏ మండలంలో సందర్శించిన అంగన్వాడీల్లో పిల్లల సంఖ్య నమోదు అయిన పిల్లల కంటే   చాలా తక్కువ సంఖ్యలో ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు.  రాబోయే 15 రోజుల్లో ఈ పరిస్థితి  మారాలని 95…

ధాన్యం రవాణ కొరకు కాంట్రాక్టర్ నియామకపు టెండర్లు తీసిన అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ

ప్రచురణార్థం వరి ధాన్యం రవాణ కొరకు కాంట్రాక్టర్ నియామకపు టెండర్లు తీసిన అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ పెద్దపల్లి, అక్టోబర్ -17: వరి ధాన్యం రవాణ కొరకు వచ్చిన టెండర్లను అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సోమవారం తెరిచారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజను 2022-23 కొరకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు రవాణా చేయుటకు కాంట్రాక్టర్ల నియామకపు టెండర్లు పిలవగా, జిల్లాలోని నాలుగు సెక్టారులకు (పెద్దపల్లి ,…

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ.

ప్రచురణార్థం ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ. పెద్దపల్లి, అక్టోబర్ -17: ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్లు వి.లక్ష్మినారాయణ, కుమార్ దీపక్ లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.…

అధికారులు ప్రజల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.

అధికారులు ప్రజల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.  సోమవార కలెక్టరేట్ ప్రజావాణి హాల్లొఅదనపు కలెక్టర్.  , పద్మజా రాణి తో కలిసి ప్రజల నుండి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో దరఖాస్తు చేస్తే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందనే నమ్మకంతో ప్రజలు ప్రజావాణికి వచ్చి తమ సమస్యలను ఫిర్యాదు రూపంలో ఇస్తారని వాటిని సంబంధిత జిల్లా అధికారులు సత్వరమే స్పందించి పరిష్కారం చేయాలని…

మును గోడ్ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ ఆండ్ మానిటరింగ్ కమిటీ (ఎం.సి.ఎం.సి) ఎన్నికల వ్యయ పరిశీలకు రాలు ముళ్ళ పూడి సమత సోమవారం పరిశీలించారు. వివిధ పత్రికలలో, టి.వి. ఛానల్, కేబూల్ నెట్వర్క్ లలో, సినిమా టాకిసులలో మరియు సోషల్ మీడియాలో వచ్చే వివిధ రాజకీయ ప్రకటనలను,పెయిడ్ న్యూస్ ను ఏప్పటికప్పుడు పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సర్టిఫికేషన్ మరియు మీడియా మానిటరింగ్ (MCMC)…

పైలేరియా వ్యాధి నిర్మూలనకు ప్రణాళిక బద్ధంగా నివారణ చర్యలు తీసుకోవాలి::జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం అక్టోబర్ 17 మహబూబాబాద్ జిల్లాలో పైలేరియా వ్యాధి నిర్మూలనకు ప్రణాళిక బద్ధంగా నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి వైద్య ఆరోగ్యశాఖ, అనుబంధ శాఖల అధికారులతో ఈనెల 20వ తేదీన చేపట్టనున్న ఉచిత మాత్రల పంపిణీ కార్యక్రమం పై కలెక్టర్ సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు…