Day: November 4, 2022

కలెక్టరేట్ సమావేశ మందిరంలోOPMS డేటా ఎంట్రీ పైన శిక్షణ ఇవ్వడం జరిగింది.

తేదీ:4.11.2022న కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్ 2022-23 సీజన్ కు గాను నిర్వహించబోతున్న 52 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన వివోఏ లకు ట్యాబ్ ఆపరేటర్ లకు పుస్తకం నిర్వహణ మరియు OPMS డేటా ఎంట్రీ పైన శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఆడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడుతు కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలాగే రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని…

ప్రపంచంలో అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్న ‘ఫార్ములా-ఈ’ రేసింగ్ మొదటిసారిగా మన దేశంలో ట్రాక్‌ ఎక్కనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరగనుంది. ఇందుకోసం 100 రోజుల కౌంట్ డౌన్  దేశ రాజధాని ఢిల్లీ నగరంలో లాంఛనంగా అభిమానుల కోలాహలం మధ్య శుక్రవారం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి, నీతి ఆయోగ్ సీఈఓ అమితాభ్ కాంత్ తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫార్ములా-ఈ ప్రిక్స్ ఈవెంట్‌ను ప్రపంచంలోని పన్నెండు…

రఘునాథపాలెం మండలం పాపటపల్లి గ్రామంలో రూ. 151.20 లక్షల వ్యయంతో నిర్మించిన 30 డబల్ బెడ్ రూం ఇండ్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్న పాపటపల్లి గ్రామం ఇప్పుడు ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా రూపుదిద్దుకున్నదని అన్నారు. గ్రామంలో సిసి రోడ్లు లేని వీధి లేదని, అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. డబల్ బెడ్ రూం ఇండ్లు…

నగరానికి ముఖ ద్వారమైన కాజిపేట్ అభివృద్ధికి నిరంతరం కృషి :- చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్  ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ముఖాముఖి కార్యక్రమం

*నగరానికి ముఖ ద్వారమైన కాజిపేట్ అభివృద్ధికి నిరంతరం కృషి :- చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ముఖాముఖి కార్యక్రమం కాజిపేట్:- ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను విని పరిష్కరించేందుకు గత కొన్నిరోజులుగా ముఖాముఖి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్… నేడు కాజిపేటలోని కూరగాయల మార్కెట్ వద్ద మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య,కార్పొరేటర్లు,అన్ని విభాగాల అధికారులతో కలిసి 47,48,61,62,63 డివిజన్ల ప్రజలతో…

జిల్లాలో నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాకు 14555 డబల్ బెడ్ రూంలు మంజూరు కాగా, 8956 ఇండ్లకు…

మన ఊరు-మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 426 పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమం క్రింద అభివృద్ధి పనులు చేపట్టినట్లు, 416 పాఠశాలల్లో పనులు గ్రౌండింగ్ అయినట్లు తెలిపారు. ఇందులో 372 పాఠశాలల్లో ఉపాధిహామీ క్రింద పనులు…

నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో ఎం.జి.యూనివర్సిటీ ఎదురుగా శ్రీ వల్లి టౌన్ షిప్ రాజీవ్ స్వగృహా ఓపేన్ ప్లాట్లు (229),పాక్షిక నిర్మాణ గృహాలు (355) విక్రయానికి ఫ్రీ బిడ్ అవగాహాన సదస్సు నేడు (నవంబర్ -5 ) ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయము సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రీ బిడ్ సమావేశం లో ఆసక్తి ఉన్న ఔత్సాహికులు,ప్రజలు పాల్గొని విజయవంతం…

మును గోడ్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్  సజావుగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు.  శుక్రవారం నల్గొండ పట్టణం అర్జాల బావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ  కౌంటింగ్ కేంద్రంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ప్రతినిధుల  సమక్షంలో స్క్రూటినీ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు పంకజ్ కుమార్  తో కలిసి స్క్రూటినీ నిర్వహించారు. మును గోడ్ నియోజకవర్గంలోని  పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్…

కలెక్టర్ బంగ్లా వద్ద రూ.9.80 కోట్లతో చేపట్టిన అత్యవసర మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, హాజరైన మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు.

ఈనెల 12వ తేదీన రామగుండంలో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్, రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ సి.ఈ.ఓ ఏ.కె జైన్ లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా సి.ఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, ప్రధాని పర్యటన…