Day: November 18, 2022

గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా హన్వాడ మండలం కారం తండాకు చెందిన దివ్యాంగుడు హరియా నాయక్ కు పల్లెమోనితండా బీసీ గురుకులం వద్ద ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్కూటీని అందించిన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు.

@ రెండు నెలల్లో హన్వాడ మండలంలో ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటు @ ఆడపిల్ల ఎవరికి భారం కాదు @ అన్ని రంగాలలో రాణిస్తున్న ఆడపిల్లలు- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆడపిల్లలు ఎవరికి భారం కాదని, వారిని బాగా చదివించి ఉన్నత స్థానంలో నిలపాలని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక ,పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ కోరారు. శుక్రవారం అయన మహబూబ్ నగర్ జిల్లా…

మనవూరు..మనబడి అభివృద్ధి పనులు ప్రణాళికాబద్ధంగా జరగాలి..జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్ధం మహబూబాబాద్, నవంబర్,18. మనవూరు..మనబడి క్రింద చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ధేశించిన విధంగా నిర్ణీత వ్యవధిలో జరిపించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో మనఊరు… మనబడి ప్రణాళిక క్రింద చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా… కలెక్టర్ మాట్లాడుతూ మన ఊరు మనబడి కార్యక్రమం కింద జిల్లాలో 898 స్కూలు చేపట్టగా మొదటి విడతగా 316 స్కూల్స్ లలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు…

సమాచార హక్కు చట్టం కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమాలు:: రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డా. మహ్మద్ అమీర్.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన అప్పీల్ హియరింగ్ లో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడిగిన దరఖాస్తుదారులు, పౌర సమాచార అధికారులతో వ్యవసాయ , రెవిన్యూ తదితర శాఖలలో 10 కేసులకు సంబంధించి విచారణను కమీషనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయంలో సెక్షన్ 4 (1) బి సమాచారాన్ని తప్పనిసరిగా పొందుపరచాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డా. మహ్మద్ అమీర్ అన్నారు. సమాచార హక్కుచట్టం సెక్షన్ 6(1)…

DPRO ADB- రాజీవ్ స్వగృహ లే అవుట్ ఇంటి స్థలాలకు ప్రత్యక్ష వేలం పాటలో పాల్గొని స్వంతం చేసుకోండి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

రాజీవ్ స్వగృహ లే అవుట్ లోని ఇంటి స్థలాలను కొనుగోలు చేసుకొని చిరకాల వాంఛ నెరవేర్చు కోవాలని, ప్రత్యక్ష వేలం పాటలో పాల్గొని స్వంతం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఐదవ రోజు శుక్రవారం రోజున ఎన్. జనార్ధన్ రెడ్డి గార్డెన్ లో స్వగృహ ప్లాట్ల వేలం పాటలను నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన 70 ప్లాట్ లలో అత్యధికంగా గజానికి రూ.16,800/- ధరతో ఇంటి ప్లాట్ ను స్వంతం చేసుకున్నారని…

ఆధార్ ను అప్ డేట్ చేసుకోవాలి…జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్ నవంబర్ 18. జిల్లాలోని పౌరులందరూ తప్పనిసరిగా ఆధార్ అప్ డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఆధార్ అప్ డేట్ ( నవీకరణ)పై మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమఅభివృద్ధి పథకాలు, పౌర సేవలను పొందాలనుకునేవారు ఆధార్ అప్ డేట్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. 2016 కంటే ముందు ఆధార్ గుర్తింపు కార్డు పొందిన వారంతా యు.ఐడి.ఏ.ఐ. (యూనిక్…

పాఠశాల అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలి…జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం కురవి మహబూబాబాద్, నవంబర్ 18. పాఠశాలల అభివృద్ధి కొరకు మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కురవి మండల కేంద్రంలో పర్యటించి మండల ప్రజా పరిషత్ పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పనులను కలెక్టర్ సంబంధిత అధికారులతో సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… పాఠశాల ఆవరణను ప్రణాళిక ప్రకారంగా చేపట్టాలని…

ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును మెరుగుపరచాలి  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

తేదీ : 18-11-2022 : వైద్యాధికారులు, ఐసిడిఎస్, సిడిపిఓలు, సూపర్ వైజర్లు తో నిర్వహించిన సమావేశం లో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ లోకల్ బాడీస్.

బ్యాంకర్లు రుణాల లక్ష్యాలను చేరుకోవాలి

తేదీ : 18-11-2022 : బ్యాంకర్స్ తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ లోకల్ బాడీస్.

పౌష్టికాహార లోపాలను సరి చేసేందుకు బాధ్యతతో పని చేయాలి…జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్ నవంబర్ 18. చిన్నారులలో పౌష్టికాహార లోపాలను సరి చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు బాధ్యతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. శుక్రవారం కురవి మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌష్టికారా లోపంపై ఏర్పాటు చేసిన 0-5 సంవత్సరముల చిన్నారులలో పౌష్టికాహార లోపాలను గుర్తించి సరి చేసేందుకు ఏర్పాటుచేసిన మండల స్థాయి అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ పాల్గొని అవగాహన పరిచారు. ఈ అవగాహన సదస్సులో…