Day: November 22, 2022

మహారాష్ట్ర బ్యాంకును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్, నవంబర్ 22. పట్టణంలోని ఐఎంఏ హాల్ ఎదురుగా ఏర్పాటు చేసిన మహారాష్ట్ర బ్యాంకును లీడ్ బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ అధికారులతో కలిసి మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ శశాంక ప్రారంభించారు. అనంతరం బ్యాంకును సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహారాష్ట్ర బ్యాంకు కార్యకలాపాలు మరింతగా విస్తరింపజేసి ప్రజలకు విస్తృత సేవలు అందించాలని కోరారు. అలాగే ప్రభుత్వ పథకాల లో అర్హులైన వారికి రుణా ప్రక్రియను…

DPRO ADB- ప్రాథమిక స్థాయి విద్యార్థులలో అభ్యాస సామర్థ్యాలను పెంపొందించేందుకు జాతీయ మదింపు సర్వే (NAS) లో భాగంగా పరీక్షను నిర్వహించడం జరుగుతుంది- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

ప్రాథమిక స్థాయి విద్యార్థులలో అభ్యాస సామర్థ్యాలను పెంపొందించేందుకు జాతీయ మదింపు సర్వే (NAS) లో భాగంగా పరీక్ష ను నిర్వహించడం జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం పట్టణంలోని మసూద్ నగర్ బాలాక్ మందిర్, హమీద్ పుర ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న నేషనల్ అచివ్మెంట్ సర్వే లో భాగంగా నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రాథమిక స్థాయి విద్యార్థులలో అభ్యాస…

పత్రికా ప్రకటన        తేది:21.11.2022, వనపర్తి. పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమం పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం మదనాపురం, ఆత్మకూర్ మండలాలను సందర్శించి పారిశుధ్యం, హరిత హారం పనులను ఆయన పరిశీలించారు. మదనపురం పరిధిలోని పారిశుధ్యం, త్రాగునీరు, మురుగు కాలువలు, తడి చెత్త, పొడి చెత్త సేకరణ పనులను, రోడ్లకు ఇరువైపుల వున్న మొక్కలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆత్మకూర్ మండలంలోని…

పత్రికా ప్రకటన.     తేది:21.11.2022, వనపర్తి. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదు దారుల నుండి అందిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా జిల్లా అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల దరఖాస్తులను ఆమె స్వీకరించారు. పెన్షన్ లను సంబంధించిన దరఖాస్తులు (09), ఇతర శాఖలకు…

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి – రైతులకు ఇబ్బందులు కలుగొద్దు. – నాణ్యత ప్రమాణాల ప్రకారం తెచ్చిన ధాన్యం లో కోతలు విధించకుండా చూడాలి – ధాన్యం డబ్బులను సాధ్యమైనంత త్వరగా రైతులకు చెల్లించాలి – ఇప్పటి వరకూ జిల్లాలో 2923 మంది రైతుల ఖాతాల్లో 39.64 కోట్ల జమ – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి —————————– రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా, పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను…

పెండింగ్ సివిల్, ఫీల్డ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలి – PS నగర్, కోనారావుపేట, కోదురు పాక ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర, కేంద్ర బృందాల అసెస్ మెంట్ కు సర్వ సన్నద్ధం చేయాలి – ఎన్‌క్వాస్ గుర్తింపు వచ్చేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* —————————– జిల్లాలోని పిహెచ్‌సిలకు ఎన్‌క్వాస్ (నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ స్టాండర్డ్) గుర్తింపు వచ్చేలా కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్య…