ధాన్య సేకరణ కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో ధాన్య సేకరణ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 221 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించి, అన్ని కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 25 కేంద్రాలలో 355 మంది రైతుల నుండి 2391.040 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 2210.400 మెట్రిక్ టన్నుల ధాన్యం…
Day: November 28, 2022
ASF : ప్రజా సమస్యల పరిష్కారం కొరకే ప్రజావాణి కార్యక్రమం : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో గల కలెక్టర్ ఛాంబర్ లో అర్జిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని కోసిని గ్రామానికి చెందిన వసాకే హనుమంతు తాను మీ సేవ కేంద్రం కొరకు దరఖాస్తు చేసుకొని పరీక్ష రాసి అర్హుడిని అయ్యానని, తనకు మీసేవ కేంద్రం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని పవార్ గూడ గ్రామానికి చెందిన…
MNCL : ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, సవరణలు, తొలగింపుల కొరకు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డిసెంబర్ 3, 4 తేదీలలో జిల్లాలో చేపడుతున్న ప్రత్యేక శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, బి.రాహుల్‌తో కలిసి ఓటరు జాబితా సవరణ, నూతన ఓటరు నమోదు సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు.…
MNCL : ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు : జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్‌లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కాసిపేట మండలం దుబ్బగూడెం గ్రామానికి చెందిన దరావత్ తిరుపతి, లావణ్య, రమేష్, మహారాజ్‌లు తమ తండ్రి పేరిట దుబ్బగూడెం గ్రామంలో భూమి, తమ తల్లి పేరిట…
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ ————————————- పెద్దపల్లి నవంబర్ 28 ————————————- 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1,2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన యువతీ యువకులు ఓటరుగా తమ పేరు నమోదు చేసుకునేందుకు సమీప బూత్…
ప్రణాళిక బద్ధంగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి – అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ

ప్రచురణార్థం ప్రణాళిక బద్ధంగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి – అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ 304 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ధాన్యం కొనుగోలు పై సమీక్షించిన అదనపు కలెక్టర్ పెద్దపల్లి , నవంబర్ – 28 : జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ తన చాంబర్లో వానాకాలం 2022-23 సంవత్సరానికి…
లయన్స్ క్లబ్ మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడంలో ముందుంటుంది. లయన్స్ క్లబ్ మెగా హెల్త్ క్యాంప్ అభినందనీయం :: జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో లైయన్స్ క్లబ్ హనుమకొండ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవసరార్థులను ఆదుకోవడంలో లయన్స్ క్లబ్ వారు ముందుంటారని, గత కోవిడ్ కాలంలో వారి యొక్క సేవలు…
డిసెంబర్ 8 వరకు క్రొత్త ఓటరుగా నమోదు, చేర్పులకు అవకాశం…… జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం డిసెంబర్ 8 వరకు క్రొత్త ఓటరుగా నమోదు, చేర్పులకు అవకాశం…… జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ❃ 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి ❃ డిసెంబర్ 3, 4 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ లెవెల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక నమోదు కార్యక్రమం ❃ ఫారం-6 నింపి క్రొత్త ఓటరు గా నమోదు, 6బి తో ఆధార్ లింక్ చేసుకోవాలి ❃…
ప్రజలు సమర్పించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం ప్రజలు సమర్పించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ నేడు (87) దరఖాస్తులు స్వీకరణ ——————————- పెద్దపల్లి, నవంబర్ -28: ——————————- ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ సమర్పించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు…
హ్యాండ్ వాష్ ప్లాంట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్ .కృష్ణ ఆదిత్య.

పరిశుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యంవంతులుగా జీవించవచ్చని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. సోమవారం వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేట గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రములో కేర్ ఇండియా ద్వారా ఏర్పాటు చేసిన హ్యాండ్ వాష్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ మెడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ డాక్టర్ పార్వతి సుప్రసేన తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేతుల పరిశుభ్రత ద్వారా మనము వ్యాధులు రాకుండా నివారించవచ్చని సూచించారు. ఉపకేంద్రమునకు వచ్చు రోగులు…