Day: November 29, 2022

సదరం ధ్రువీకరణ పత్రాలు జారీలో పారదర్శకత పెంచాలి…జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్ నవంబర్ 29. సదరం ధ్రువీకరణ పత్రాల జారీలో పారదర్శకత పెంచాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సదరం క్యాంపుల నిర్వహణ తీరుపై స్లాట్ బుకింగ్ లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి సంబంధిత అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సదరం క్యాంపుల నిర్వహణకు కావలసిన సామాగ్రిని, సిబ్బందిని ఏర్పాటు చేయాలని డి ఆర్ డి ఓ కు సూచించారు.…

*పోటీ ప్రపంచంలో విద్యార్థులు ప్రతిభా పాటవాలతో సాంకేతికతతో భవిష్యత్తులో సమాజంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చే మార్గదర్శకులు మీరే కావాలి……… జిల్లా కలెక్టర్ కె శశాంక

ప్రచురణార్థం మరిపెడ / మహబూబాబాద్ 29: -విద్యార్థికి పాఠ‌శాలే జీవిత కీల‌క మెట్టు – విద్య‌తో పాటుగా అన్ని సాంకేతిక క్రీడా సాంస్కృతిక రంగాల్లో తనదైన శైలితో రాణించాలి – ఏ ప‌నికైనా ఏక‌గ్ర‌తే ప్ర‌ధానం – మ‌హ‌బూబాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ కే.శ‌శాంక‌ మ‌రిపెడ: ప్ర‌తి విద్యార్థికి పాఠ‌శాల అత్యంత ప్ర‌ధాన‌మైన‌ది, పాఠ‌శాల ముగింపు ద‌శ నుంచే నిర్థిష్ట‌మైన ల‌క్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా కృషి చేయాల‌ని, విద్యార్థులు విద్య‌తో పాటుగా క్రీడ‌లు, క‌ల్చ‌ర‌ల్ పోటీల్లో పాల్గొనాల‌ని…

పనులలో నాణ్యత లోపం లేకుండా చూడాలి…జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్ నవంబర్ 29. మున్సిపాలిటీ అభివృద్ధి పనులలో నాణ్యత లోపం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి, బంధం చెరువు ఇందిరానగర్ లలో చేపడుతున్న పనులను కలెక్టర్ అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి సందర్శించి పరిశీలించారు. ముందుగా రైల్వే ఓవర్ బ్రిడ్జి కురవి రోడ్డులో జిబ్రా క్రాసింగ్ పనులను పరిశీలించారు. బ్రిడ్జి వద్ద ఏర్పాటుచేసిన ఎల్ఈడి లైట్లు పరిశుభ్రత తదితరమైన పనులను పరిశీలించారు…

మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో రాణించి విజయం సాధించాలి – అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ

ప్రచురణార్థం మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో రాణించి విజయం సాధించాలి – అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ ——————————– పెద్దపల్లి నవంబర్ -29: ——————————– మలేషియాలో జరిగే అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలలో మంచి ప్రతిభ కనబర్చి, రాణించి విజయం సాధించాలని అదనపు కలెక్టర్ వి. లక్ష్మీ నారాయణ ఆకాంక్షించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జిల్లాకు చెందిన అథ్లెటిక్ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పథకాలు సాధించిన…

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి  – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ప్రధానమంత్రి స్వానిధి రుణాల పంపిణీకి ప్రతి వారం 2 రోజులు ప్రత్యేక క్యాంపు నిర్వహణ మంథని ప్రాంతంలో రైతు రుణాలపై బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలి స్వశక్తి రుణాల రికవరీ పై దృష్టిసారించాలి బ్యాంకర్లతో డిసిసి, డిఎల్ఆర్సి సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ————————————— పెద్దపల్లి, నవంబర్ -29: ————————————– ప్రభుత్వం…

జిల్లాలో విద్యా, గృహ రుణాలతో పాటు స్వయం ఉపాధి రుణాలు లక్ష్యం మేరకు గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రిహర్ష బ్యాంకర్లను ఆదేశించారు.

జిల్లాలో విద్యా, గృహ రుణాలతో పాటు స్వయం ఉపాధి రుణాలు లక్ష్యం మేరకు గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రిహర్ష బ్యాంకర్లను ఆదేశించారు.  మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిలా స్థాయి సమన్వయ, సంప్రదింపుల సమావేశం నిర్వహింబిచారు.  ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో ఆయా బ్యాంకుల పని తీరు, ఇచ్చిన రుణాలు, మొండి బకాయిల వివరాల పై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బ్యాంకర్లు రుణాలు ఇవ్వడంలో లక్ష్యం సాధించలేకపోతున్నారని…

Chief Secretary Sri Somesh Kumar IAS said that in accordance with the directions of the Honourable Chief Minister Shri K Chandrashekar Rao, the government has so far issued orders for recruitment of 60,929 posts under different categories in various departments while orders for another 16,940 posts are ready to be issued in a couple of…

వరిధాన్యం నిర్ధేశిత లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోకళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి జిల్లా అధికారులు, రైస్‌మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వరిధాన్యం నిర్ధేశిత లక్ష్యాలను జిల్లా అధికారులు, రైస్‌మిల్లర్లు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. కమీషన్‌ పేరుతో తరుగు ఎక్కువగా నమోదు చేయడం, అప్‌లోడ్‌…

DPROADB-అర్హత గల యువతీ, యువకుల పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయాలి- ఎన్నికల కమిషన్ జాయింట్ సీఈఓ రవికిరణ్.

అర్హత గల యువతీ, యువకుల పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయాలని ఎన్నికల కమిషన్ జాయింట్ సీఈఓ రవికిరణ్ అన్నారు. మంగళవారం రోజున రాష్ట్రంలోని E.R.O. లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా సేకరించిన ఫారం-6, 7, 8 లకు సంబంధించిన వాటిపై విచారణ జరిపి ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. ఆదిలాబాద్, ఖానాపూర్ ERO లు రమేష్ రాథోడ్, కదం సురేష్, ఎన్నికల…

డిసెంబర్ 8 వరకు క్రొత్త ఓటరుగా నమోదు, చేర్పులకు అవకాశం:: జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ అదిత్య.  18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి.

డిసెంబర్ 3, 4 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ లెవెల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక నమోదు కార్యక్రమం. ఫారం-6 నింపి క్రొత్త ఓటరు గా నమోదు, 6బి తో ఆధార్ లింక్ చేసుకోవాలి. ఫారం -8 నింపి ఓటర్ కార్డ్ లో మార్పులు, సవరణలు చేసుకోవాలి. www.nvsp.in, ceo.telangana.nic.in వెబ్సైట్ ద్వారా, Voter Help Line App ద్వారా ఆన్లైన్ లో నమోదుకు అవకాశం. ఇక పై 3 నెలలకు ఒకసారి ఓటరు జాబితా…