Month: November 2022

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టి. కె. శ్రీదేవి.

ప్రెస్ రిలీజ్. తేదీ 30 .11.2022. ములుగు జిల్లా. రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టి. కె. శ్రీదేవి. బుధవారం వెంకటాపుర్ మండలంలోని పాలంపేట గ్రామంలో గల ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టి కె శ్రీదేవి సందర్శించారు. రామప్పలో జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టి కె శ్రీదేవి తో కలిసి సందర్శించారు వారికి ఆలయ అధికారులు…

DPROADB – ప్రభుత్వం ఎస్సీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు కోసం అవసరమైన సదుపాయాలు సమకూరుస్తుంది – స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

ప్రభుత్వం ఎస్సీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు కోసం అవసరమైన సదుపాయాలు సమకూరుస్తున్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం రోజున ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో షెడ్యూల్డు కులాల సంక్షేమ శాఖ జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఎస్సీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు కోసం గ్రంథాలయం, వ్యాయామశాల, తదితర సదుపాయాలు సమకూరుస్తున్నదని అన్నారు. విద్యార్థులు విధిగా చదువుతో…

ట్రాన్స్ జెండర్లు,  సెక్స్ వర్కర్లు ఓటరు నమోదులో పాల్గొనాలి.  జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్

ట్రాన్స్ జెండర్లు,  సెక్స్ వర్కర్లు ఓటరు నమోదులో పాల్గొనాలి.   జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ 000000      ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.        బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు ట్రాన్స్ జెండర్లు మరియు సెక్స్ వర్కర్లతో  ఓటరు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో జిల్లా…

సమీకృత జిల్లా కార్యాలయాల భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పనులను తనిఖీలు చేశారు. భవన ఆవరణలో అంతర్గత రహదారుల పనులు జరుగుతున్నట్లు ఆయన అన్నారు. ప్లాంటింగ్. మొక్కలు, పచ్చదనం అంతా వెంటనే ఆవరణలోకి తెప్పించాలన్నారు. లైట్లు, ఫ్యాన్ల బిగింపు పూర్తి కావచిందన్నారు. ఏసీ, లిఫ్ట్, ఫౌంటెన్, ఇతర విద్యుత్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. వారంలోపల విద్యుత్ పనులన్నీ పూర్తి కావాలన్నారు. కిటికీలు, ఫ్రెములు,…

బస్తీ దవాఖానాల ద్వారా పట్టణ పేదలకు ఇంటి చెంతనే ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్ వైఎస్సార్ నగర్ లోని బస్తీ దవాఖానాను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి రోజుకు ఎంతమంది పేషంట్లు వస్తున్నది, ఎక్కువగా ఏ ఏ వ్యాధుల వారు వస్తున్నది అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్ల పరిశీలన చేశారు. రోజుకు 40…

మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలోని అల్లిపురం, వైఎస్సార్ నగర్ లో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పురోగతిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ బుధవారం క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనులు త్వరగా పూర్తయితే బిల్లులు వెంటనే వస్తాయని ఆయన తెలిపారు. వర్కర్లను పెంచాలని, అన్ని బ్లాకుల్లో పనులు చేపట్టాలని ఆయన అన్నారు. పనుల్లో రోజువారి పురోగతి ఉండాలని, రోజూ పనులు జరిగేట్లు పర్యవేక్షణ చేయాలన్నారు. సమస్యలు…

ఆదాయం పెరగాలి ఖర్చు తగ్గాలి…జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్ నవంబర్ 30. రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర తోపాటు పంట పెట్టుబడి తగ్గించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలచే అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. బుధవారం నరసింహుల పేట మండల కేంద్రంలోని రైతు వేదికలో జలశక్తి అభియాన్ కార్యక్రమం కింద కృషి విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో మండలంలోని రైతులకు కిసాన్ మేళా నిర్వహించారు. వ్యవసాయ సేద్యంలో సరియైన అవగాహన లేకపోవడం తో నష్టపోతున్న రైతాంగం కు శాస్త్రవేత్తలచే వాటిని…

ఆర్థికపరమైన అవకాశాలను ట్రాన్స్ జెండర్ లకు కల్పించాలి

  ఆర్థికపరమైన అవకాశాలను ట్రాన్స్ జెండర్ లకు కల్పించాలి   ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు   జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 000000   ఆర్థికపరమైన అవకాశాలను ట్రాన్స్ జెండర్లకు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అధికారులకు సూచించారు.      బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్ల సంక్షేమం, చట్టాలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో…

సమాజంలో   రైతును గౌరవించినప్పుడే సమాజ అభ్యున్నతి సాధ్యo- రాష్ట్ర వ్యవసాయ , సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి -సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పత్రిక ప్రకటన తేది 30-11-2022 నాగర్ కర్నూల్ జిల్లా. సమాజంలో రైతును గౌరవించినప్పుడే సమాజ అభ్యున్నతి సాధ్యమని రాష్ట్ర వ్యవసాయ , సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం పాలెం వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ దక్షిణ మండల కిసాన్ మేళాలో వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక యుగంలో ఆహార రంగమే అతిపెద్ద పరిశ్రమ అని పేర్కొన్నారు. సర్వ ప్రాణులకు…

బ్యాంకర్లకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల బ్యాంకర్లకు సూచించారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో వివిధ బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశానికి విచ్చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ … సెప్టెంబర్ నెలాఖరు లోపు వ్యవసాయ రుణాల కింద 3440 కోట్ల రూపాయలు రుణాలు అందించే లక్ష్యం కాగా 1075 కోట్ల రుణాలు అందించి 31% రుణాలను ఇవ్వడం జరిగిందని ఆమె అన్నారు. చిన్న, సూక్ష్మ , మధ్య తరహా పరిశ్రమలకు 1016 రుణాలు…