Day: December 1, 2022

SSC నిర్వహించే పరీక్షలకు సిద్ధమయ్యే తెలంగాణా రాష్ట్ర యస్.టి/యస్.సి/బి.సి  అభ్యర్థులకు అవసరమయ్యేశిక్షణను తెలంగాణా రాష్ట్రగిరిజన సంక్షేమశాఖచే 60రోజులు ఉచితంగా ఇచ్చుటకు PETC, హైదరాబాద్ లో ఏర్పాట్లు చేయడమైనది.యస్.టి/యస్.సి/బి.సి అభ్యర్థుల డిగ్రీ ఆధారంగా ST-75, SC-15, BC-10 చొప్పున 100 మంది అభ్యర్థులకు 02.01.2023నుండి శిక్షణ ఇవ్వబడును. శిక్షణ పొందుటకు ఆన్ లైన్ లో http://studycircle.cgg.gov.in వెబ్ సైట్ ద్వార దరఖాస్తులు కోరబడుచున్నవి. ఆన్ లైన్ దరఖాస్తులుగడువు 02.12.2022 నుండి 17.12.2022. మెరిట్ మరియు రిజర్వేషన్ ప్రాతిపదికన శిక్షణకై…

విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని  గట్టి పట్టుదలతో కృషి చేస్తే లక్ష్య సాధనకు తనవంతు  సహకారం అందిస్తానని   ప్రభుత్వ విప్, అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు విద్యార్థులకు భరోసా కల్పించారు.

విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని  గట్టి పట్టుదలతో కృషి చేస్తే లక్ష్య సాధనకు తనవంతు  సహకారం అందిస్తానని   ప్రభుత్వ విప్, అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు విద్యార్థులకు భరోసా కల్పించారు.  నాగర్ కర్నూల్ జిల్లా లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లో నవంబర్ 29 నుండి 3 రోజుల పాటు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల్ విజ్ఞాన ప్రదర్శనకు ముగింపు ఉత్సవానికి జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. …

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం తో పాటు మౌళిక సదుపాయాలు కల్పించాలని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి మొహమ్మద్ ఉమర్ అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం తో పాటు మౌళిక సదుపాయాలు కల్పించాలని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి మొహమ్మద్ ఉమర్ అన్నారు.   గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ న్యాయ సేవా సాధికారత కమిటీ  ఆదేశానుసారం    జిల్లాలో నవంబర్ 26 నుండి   డిసెంబర్ 2వ తేదీ  వరకు తాలూకా న్యాయ…

పోడు భూముల హక్కు పత్రాల విషయమై చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో పోడు భూముల హక్కు పత్రాల ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 94 గ్రామ పంచాయతీల్లోని 132 ఆవాసాల్లో హక్కుల కోసం 18295 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తుల పరిశీలన, గ్రామ సభల నిర్వహణ పూర్తయినట్లు ఆయన అన్నారు. పోడు భూముల సర్వే, మ్యాప్…

జిల్లాలో జీవో నెం. 58, 59 ల ద్వారా క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో జీవో 58, 59 దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రమబద్ధీకరణ కు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జీవో 58 క్రింద జిల్లాలో 9,398 దరఖాస్తులు రాగా, 3,350…

జిల్లాలో క్రొత్త ఓటర్ల నమోదు ప్రక్రియపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం, స్వీప్ కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఓటు హక్కు అందించాలని, ఓటరు జాబితా పకడ్బందీగా సిద్ధం చేయాలని అన్నారు. భారత ఎన్నికల కమిషన్ 17 సంవత్సరాలు నిండిన వారికి ఓటు…

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి…జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్ డిసెంబర్ 1. డోర్నకల్ నియోజకవర్గం లో చేపడుతున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల ప్రగతి పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1800 నిర్మాణాలు చేపట్టగా వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తయిన చిలంచర్ల ఉయ్యాలవాడ మొగిలిచర్ల ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని అదనపు…

ధాన్యం కొనుగోలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి…జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్ డిసెంబర్ 1. జిల్లాలో ధాన్యం విక్రయాలకు వస్తున్నందున కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ డేవిడ్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏర్పాటు చేసిన ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయాలు జరపాలని ఆదేశించారు. 230 కేంద్రాలలో 27 మాత్రమే ఏర్పాటు చేయగా 123 కేంద్రాలలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయన్నారు. ప్రతి కేంద్రంలో…

దళిత బందు లక్ష్యాలను పూర్తి చేయాలి… జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచరణార్థం మహబూబాబాద్ డిసెంబరు 01. నిర్దేశించుకున్న దళిత బంధు లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో దళిత బంధు పథకం లక్ష్యాలను సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ది దారులు ఎంపిక చేసుకున్న పథకాలను వారికి అందించేలా అధికారులు కృషి చేయాలన్నారు. పాడి పరిశ్రమ కోళ్ల పరిశ్రమలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఆయా పరిశ్రమలపై అవగాహన పరుస్తూ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.…

ఆసుపత్రి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి…జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్, డిసెంబర్,01. ఆసుపత్రి అభివృద్ధి పనులు వేగవంతం చేసి అందుబాటులో కి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించి వైద్య , ఇంజనీరింగ్ అధికారులతో అభివృద్ధి పనులు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… లీకేజీ లను అరికట్టాలని, ఏ.సి.లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాలను ఆసుపత్రిలో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయించరాదని బయటనే పార్కింగ్ కు ఏర్పాటు చేయాలన్నారు. 102 108 వాహనాలకు…