2023 జనవరి ఒకటి నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి అగుచున్న ప్రతి యువత ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకునేందుకు ప్రత్యేక క్యాంపు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష నేడోక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 26,27 వ తేదీన అదే విధంగా డిసెంబర్ 3,4వ తేదీల్లో ప్రతి పోలింగ్ బూత్ లో బి.ఎల్.ఓ లు ఉండి ఓటరు నమోదు కార్యక్రమం చేపడతారని తెలియజేసారు. ఓటరు నమోదుకు తమ సమీపంలోని పోలింగ్ స్టేషన్ కు తగిన ధ్రువ పత్రాలతో వెళ్లి వయస్సు నిర్ధారించే ధ్రువపత్రాలు, ఆధార్, ఫోటో వంటివి తీసుకువెళ్లి ఫారం-6 తీసుకొని పూరించి బి.ఎల్.ఓ కు ఇచ్చేయాలని తెలిపారు. జనవరి ఒకటి 2023 తేదీ నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి కానున్న వారు, ఇప్పటికే 18 సంవర్సరాల వయస్సు పూర్తి అయిన వారు దివ్యంగులు, ట్రాన్సజెండర్లు ఈ ప్రత్యేక క్యాంపెయిన్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక క్యాంపెయిన్ రోజుల్లో బి.ఎల్.ఓ లు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. ఓటరు నమోదుకు ఆన్లైన్ ద్వారా కానీ ఫారం-6 ద్వారా కానీ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవచ్చన్నారు. జాబిత లో మార్పు చేర్పులు, చనిపోయిన ఓటర్ల పేర్ల తొలగింపు, పోలింగ్ స్టేషన్ మార్పు వంటివి సైతం ఈ ప్రత్యేక క్యాంపెయిన్ లో నమోదు చేసుకోవచ్చని తెలియజేసారు.