2023-24 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన వైద్య కళాశాలలలో తరగతులు ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టి పనులు పూర్తిచేయాలి : రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వి

2023-24 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన వైద్య కళాశాలలలో తరగతులు ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టి పనులు పూర్తిచేయాలని రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వి అన్నారు.

శనివారం హైదరాబాద్ నుండి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత వైద్య, ఇంజనీరింగ్ అధికారులతో
వైద్య కళాశాలల నిర్మాణం, వసతుల కల్పన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను వేగవంతంగా అందించేందుకు వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంచే విధంగా రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు మంజూరు చేయడం జరిగిందని, ఈ క్రమంలో చేపట్టిన కళాశాలల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు టీవీ
శానిటోరియంలో పూర్తికావస్తున్నాయని, ఆసుపత్రి మొదటి అంతస్తు పనులు కూడా పూర్తయినాయని, రెండవ అంతస్తు పనులు జూలై 15 వరకు పూర్తవుతాయని తెలిపారు. కళాశాలలో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థిని, విద్యార్థుల కోసం వసతి కల్పించేందుకు టిబి శానిటోరియంలో మరమ్మత్తు పనులు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. పనులన్నీ వేగవంతంగా పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి డి ఈ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share This Post