(21.07.2022) ఎం.జి. ఎన్.ఆర్.ఈ.జి. ఎస్. పథకం పనులపై సమీక్ష సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.    తేది:21.07.2022, వనపర్తి.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ పనులలో జాప్యం లేకుండా పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు.
గురువారం నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం జిల్లా కలెక్టర్ చాంబర్ లో ఎం.జి. ఎన్.ఆర్.ఈ.జి. ఎస్. పథకం కింద చేపట్టిన వివిధ పనులపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన హరితహారం, ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు తదితర అంశాల పురోగతిని ఆమె సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఉపాధిహామీ కూలీల బయోమెట్రిక్ హాజరు తీసుకోవాలని, జాబ్ కార్డులు పంపిణీ, ఎఫ్.టి.ఓ. జనరేషన్, అకౌంట్ల అప్డేషన్, వెండర్స్ రిజిస్ట్రేషన్, కూలీల చెల్లింపులు తదితర అంశాలపై రిపోర్టులు తయారు చేయాలని ఆమె సూచించారు.హరితాహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని, ప్లాంటేషన్, నర్సరీలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలలో మొక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆమె అన్నారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన రిజిస్టర్లు, ఆడిట్ రిపోర్టులు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వా న్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, డి ఆర్ డి ఓ నరసింహులు, డి పి ఓ.సురేష్, డీ.ఎఫ్.ఓ. రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, అడిషనల్ డి ఆర్ డి ఓ కృష్ణయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post