(21.07.2022) ఏ ఆదరణలేని చిన్నారులను గుర్తించి, వారిని సంరక్షించాలి : జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన        తేది:21.07.2022, వనపర్తి.

జిల్లాలో ఏ ఆదరణలేని చిన్నారులను గుర్తించి, వారి కోసం ఏర్పాటుచేసిన సఖి కేంద్రం, చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్, చైల్డ్ హోమ్ ల ద్వారా సంరక్షించాలని సంబంధిత అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.
గురువారం ఐ డి ఓ సి. జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సఖి కేంద్రం, ఐ సి డి ఎస్, చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్, చిల్డ్రన్ హోమ్, అంగన్వాడి కేంద్రాలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఆదరణలేని చిన్నపిల్లలను గుర్తించి ఆయా కేంద్రాలలో చేర్పించాలని, వారికి అవసరమైన వసతులు కల్పించి వారిని సంరక్షించాలని ఆయన సూచించారు. అంగన్వాడి కేంద్రాలలోని బరువు తక్కువగా ఉన్న చిన్నారులను గుర్తించి, వారికి పౌష్టికాహారాన్ని అందించాలని, పిల్లల ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. చిన్నారులకు పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు నూతన విధానాలను అవలంబించాలని ఆయన సూచించారు. అంగన్వాడి భవనాల స్థితులను రిపోర్టు తయారు చేయాలని ఆయన తెలిపారు. సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటుచేసిన కార్యక్రమాలలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డి డబ్ల్యూ ఓ పుష్పలత, సూపర్డెంట్ వరప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర చారి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రాంబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post