(21.07.2022) “మా ఇంటి పంట” కార్యక్రమంలో భాగంగా 589 అంగన్వాడి కేంద్రాలలో కూరగాయల సాగు : జిల్లా సంక్షేమ అధికారిని పుష్పలత

పత్రికా ప్రకటన     తేది:21.07.2022, వనపర్తి.

ఈ నెల 16వ తేదీన ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “మా ఇంటి పంట” కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించి, కూరగాయల సాగుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిని పుష్పలత తెలిపారు.
గురువారం వనపర్తి జిల్లాలోని 589 అంగన్వాడి కేంద్రాలలో “మా ఇంటి పంట” కార్యక్రమం ద్వారా కూరగాయల విత్తనాలను నాటినట్లు ఆమె తెలిపారు. ఇంటిలో పండించిన పంటలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని ఆమె అన్నారు. ప్రజలలో అవగాహన కల్పించి ప్రతి ఇంటిలో కుండీలలో, ఖాళీ స్థలాలలో, పంట పొలాల్లో కూరగాయలను పండించాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో డి డబ్ల్యూ ఓ పుష్పలత, అంగన్వాడి టీచర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post