21.09.2021 వైద్యులు, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు

ప్రెస్ రిలీజ్. తేది 21.09.2021 వైద్యులు, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి వ్యాక్సినేషన్ కేంద్రాలను తప్పనిసరిగా తెరిచి ఉంచాలని కోరారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు. అంగన్వాడి, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటా సర్వే చేపట్టి స్టిక్కర్లు అతికించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్య అధికారులకు సూచించారు.కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, వైద్యుడు ఇదిరిచ్ గోరి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. Dpro..Kamareddy.

Share This Post