21.09.2021 PRESS NOTE-1

2021-22 ఆర్థిక సంవత్సరం కు గాను స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థల (వృద్ధాశ్రమాలు,అనాథాశ్రమాలు,మానసిక వికలాంగుల ఆశ్రమాలు మొదలగు సంస్థల) నుండి ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుటకు అర్హత గల సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని  షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు సల్మాభాను ఒక ప్రకటన లో తెలిపారు.నల్గొండ జిల్లా పరిధి లోని రిజిస్టర్డ్  స్వచ్ఛంద సంస్థలు,ప్రభుత్వేతర సంస్థలు దరఖాస్తు ఫారం  ఉప సంచాలకులు,షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ,సంక్షేమ భవన్,జిల్లా కలెక్టర్ కార్యాలయం లో పొందవచ్చని,దరఖాస్తు పూర్తి చేసి సంబంధిత ధ్రువ పత్రం లు జత పరచి ఉప సంచాలకులు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ,నల్గొండ కార్యాలయం లో సమర్పించాలని ఆమె ఈ ప్రకటన లో తెలిపారు

Share This Post