22వ. వార్డులో బ‌తుక‌మ్మ చీరల పంపిణీ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రిక ప్రకటన
తేది:04.10.2021, వనపర్తి.

రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ కానుకగా మహిళలందరికీ బ‌తుక‌మ్మ చీరల పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
సోమవారం వనపర్తి మున్సిపాలిటీలోని 22వ. వార్డు ఉప్పర లచ్చన్న కాలనీ జ్యోతి ప్రజ్వలన చేసి, బతకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తో కలిసి, మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్ర‌తి ఆడ బిడ్డను గౌరవించడానికి, బ‌తుక‌మ్మ పండుగ‌ను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని మంత్రి అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు బ‌తుక‌మ్మ చీరలను పంపిణీ చేస్తుందని ఆయన తెలిపారు. వనపర్తి జిల్లాకు ఇప్పటి వరకు ఒక లక్ష 64 వేల బతుకమ్మ చీరలు చేరాయని మంత్రి వివరించారు. దసరా పండగ కానుకగా ఈ కార్యక్రమం చేపట్టిందని, ప్రతి ఆడబిడ్డ సంతోషంగా దసరా పండుగను జరుపుకోవాలని మంత్రి సూచించారు. మంత్రి చేతుల మీదుగా బతుకమ్మ చీరల పంపిణీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఎమ్మార్వో రాజేందర్ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
…………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

 

Share This Post