(22.07.2022) కొత్తకోట మండలంలోని సంకిరెడ్డిపల్లి, ఈదులబావి, కనాయపల్లి గ్రామ పంచాయతీలలోని క్రీడా ప్రాంగణాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన      తేది:22.07.2022, వనపర్తి.

క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తెలంగాణకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ సూచించారు.
శుక్రవారం కొత్తకోట మండలంలోని సంకిరెడ్డిపల్లి, ఈదులబావి, కనాయపల్లి గ్రామ పంచాయతీలలోని క్రీడా ప్రాంగణాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను క్రీడలలో ప్రోత్సహించి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణకు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాలలో సరైన సౌకర్యాలు కల్పించినట్లయితే యువత క్రీడలలో ఎదిగేందుకు దోహదపడుతుందని, క్రీడల ద్వారా ఆరోగ్యం, దృఢత్వం ఉంటుందని, పోటీతత్వం పెరుగుతుందని ఆయన అన్నారు.
సంకిరెడ్డిపల్లిలోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆయన పరిశీలించారు. ఈదులభావి గ్రామపంచాయతీలో క్రీడా మైదానానికి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కనాయపల్లిలోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని, క్రీడా ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. క్రీడా ప్రాంగణాలను యువత సద్వినియోగం చేసుకొని క్రీడలలో రాణించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి యుగంధర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీపాద, పంచాయతీ సెక్రటరీలు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్, ఏ పీ ఓ లు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post