(22.07.2022) సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ0 : జిల్లా కలెక్టర్ షేక యాస్మిన్ భాష, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

పత్రికా ప్రకటన
22 7 2022
వనపర్తి

ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ షేకియాస్మిన్ భాష అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తో పాటు పాల్గొని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలో కళాశాలలో ఏర్పాటు చేసిందని అన్నారు ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని అన్నారు. విద్యార్థినులు జూనియర్ కళాశాలో గురువులు చెప్పే పాఠాలను శ్రద్ధగా ఆలకించి పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని అన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా విద్యకు పెద్దపీట వేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక గురుకుల పాఠశాలలో విరివిగా ఏర్పాటు చేసిందని అలాగే జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు ఒకే చోట ఉండి చదివే వీలు కలిగిందని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్కు ఎమ్మెల్యేకు విద్యార్థినులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ అధికారిని తోపాటు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

……………………………
… జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి జారీ చేయబడినది.

Share This Post