22 – 09 -20 21 తాడ్వాయి మండలం ఎర్రపాడు ఆస్పత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేశ్ V. పాటిల్

తేది22.09.2021 ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే విధంగా వైద్యులు, వైద్య సిబ్బంది చూడాలని జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. బుధవారం తాడ్వాయి మండలం ఎర్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. గర్భిణిలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ముందస్తుగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న 30 గ్రామాల్లో వ్యాక్సినేషన్ 100% పూర్తిచేయాలని వైద్యుడిని ఆదేశించారు. గ్రామాల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని కోరారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారిని పాపమ్మ, స్టాఫ్ నర్స్ స్వాతి, ల్యాబ్ టెక్నీషియన్ భరత్, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post