చందంపేట మండలంలో నెలకొన్న భూముల సమస్యలను త్వరలో పరిష్కరించే విధంగా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ,దేవర కొండ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ లు రైతులకు తెలిపారు.బుధవారం చందం పేట మండలములోని సర్కిల్ తండా కంభాల పల్లి,పాత కంభాలపల్లి,పొగిల్ల గ్రామాలలో అటవీ ప్రాంతంలో ఉన్న రైతుల భూములను అటవీశాఖ అధికారులు,రెవిన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సంద ర్భముగా రైతులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్,శాసన సభ్యులు రవీంద్ర కుమార్ల కు వివరించారు. గత నెల రోజులు నుంచి అటవీశాఖ అధికారులు రైతుల మధ్య భూసమస్యలపై తగాదాలు చోటు చేసుకుంటున్నాయి .ఈ నేపథ్య oలో ఆయా గ్రామాలకు సంభంధించిన కొంత మంది రైతులపై కేసులు సైతం నమోదు చేశారు. ఈ మేరకు గ్రామానికి చెందిన రైతులు,ప్రజా ప్రతినిధులు స్థానిక శాసన సభ్యులు రవీంద్ర కుమార్ దృష్ఠికి తీసుకెళ్లడం తొ జిల్లా మంత్రి జగదీ శ్వ ర్ రెడ్డి సూచన మేరకు ఆయా గ్రామాలలో నెలకొన్న భూ సమస్యలను జిల్లా అధికారులు క్షేత్ర స్థాయి లో పర్యటించి పరిశీలించారు. సర్కిల్ తoడాలో రైతుల భుములలొ అటవీశాఖ వారి ఆధ్వర్యంలో నాటిన మొక్కలను పరిశీలించేందుకు సరైన రహదారి లేక పోవడంతో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటి,ల్ ఎం.ఎల్ ఎ.రవీంద్ర కుమార్ ద్వి చక్ర వాహనముల పై వెళ్లారు .ఆయా గ్రామాలకు చెందిన రైతులు నాగార్జున సాగర్ కట్ట నిర్మాణంలో ముoపునకు గురై అప్పట్లొ ప్రభుత్వము ఇచ్హిన భూమితో పాటు సమీపంలో ఉన్న భూములను సేద్యం చేసుకొని జీవనం గడుపుతు న్నామని రైతులు మొరపెట్టుకున్నారు. గత 60సం..ల నుండి భూములను సేద్యం చేసుకొని పంటలు సాగు చేస్తున్నప్పటికీ ఈ మద్య కాలంలో అటవీశాఖ అధికాఅరులు అటవీ ప్రాతా నికి సంభంధించిన భూములని ఆయా భుములలొ మొక్కలు నాటే కార్యక్రమం చెపట్టినారు. మా ముత్తా త కాలం నాటి సమాధి సైతం కలెక్టర్ కు విన్నవించారు. పంటలు సైతం సాగుచేయ కుండా అడ్డుకుంటున్నారు . స్పందించిన జిల్లా కలెక్టర్, అధికారులు ఎం.ఎల్ ఏ.తో కలిసి క్షేత్ర స్థాయి లో పరిశీలించారు.

