Distribution of clothing to Muslim brothers

మన తెలంగాణ | చేర్యాల : మండలంలోని చిట్యాల గ్రామంలో రంజాన్ పండగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంచే ముస్లిం సోదరి సోదరులకు అందిస్తున్న టువంటి నూతన వస్త్రాలను ఆదివారం గ్రామ సర్పంచ్ ఎర్రబెల్లి రాంమోహన్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీ మణులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో భాగంగా కోవిద్ నిబందనలు పాటిస్తూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి మిట్టపల్లి సులోచన శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు తదితరులుపాల్గొన్నారు.

Share This Post