Hon’ble Minister’s Speech on
International Day for Biological Diversity – 2021
- My heartfelt wishes to all on this occasion of International Biodiversity Day 2021
- Bio diversityis the variety and variability of life on Earth. Biodiversity is typically a measure of variation at the genetic, species, and ecosystem
- Human beings depends directly and indirectly on biodiversity for their livelihood.
- Entire human kind is linked with the biodiversity; it is the composition of the organisms that are associated with our habitats and with us.” To further explain every living thing that lives on this earth Biodiversity needs to be considered.
- We are all now experiencing pandemic troubles. These pandemics are nothing but consequence of Bio diversity imbalance . So that we are all to understand the importance of Bio diversity on human kind.
- The United Nations has proclaimed May 22 as the International Day for Biological Diversity (IDB) to increase understanding and awareness of biodiversity. The theme for this year International Biological Diversity Day is
“We are part of the solution”.
- The slogan was chosen to be a continuation of the momentum generated last year under the over-arching theme,
“Our solutions are in nature”,
which served as a reminder that biodiversity remains the answer to several sustainable development challenges. From nature-based solutions to climate, health issues, food and water security, and sustainable livelihoods, biodiversity is the foundation upon which we can build back better.
- India is known for rich heritage of Biological diversity. One of the 17 largest biodiversity hotspots in the world. India, which covers only 4 per cent of the world’s land area, already accounts for 7.8 per cent of the world’s species. 1.36 Lakh Plant and Animal species documented so far.
- India is an important partner in the Convention on Biological diversity (1992). In line with this, India enacted the Biodiversity Act in 2002 in accordance with the Convention on Biological Diversity Conservation.
- Telangana State is giving more importance to Bio diversity under the dynamic leader ship of Hon’ble Chief Minister Sri K.Chandra Sekhar Rao garu. Massive programme of tree plantation is taken up as Telanganaku Haritha Haaram. 4% of green cover is already increased . This elevation of greenery will protect environment as well strengthen Bio diversity. Hyderabad City hoisted already UN Convention on Biological Diversity (CBD) long back.
- In order to strengthen the Bio diversity, Telangana State constituted Biodiversity Management Committee (BMC) at Zilla Parishad, Mandal, Gram Panchayat and Municipality levels .We are launching
jeeva vaividhyam Racha Banda
(Biodiversity Chaupal) on 22 May 2021 to reach every individual of the gram panchayat BMCs and create awareness about the Biological Diversity Act,2002.
- To celebrate International Biological Diversity Day in this lockdown situation Telangana State Biodiversity Board (TSBDB) has started an online awareness campaigns for the school/college students and common people about the biodiversity conservation. Several online activities like Painting, essay, Biodiversity theme dance, cartoon designing, slogan competition, Biodiversity Theme fancy dress, Photography, Elocution are organized through a webpage in this pandemic situation.
- The Telangana State first register cattle Thrupu Poda is awarded with India Biodiversity Award under Indigenous Breed Conservation Category by Government of India. Expecting to receive more awards in coming years.
- I request all to create more awareness on environment protection. Let us bring Telangana state as Bio diversity destination of the world. Pl do work with same spirit and inspiration.
I wish you all once again on this occasion and be a part of the solution.
Wear mask , Keep maintain physical distance and be safe.
Thank you one and all
*జీవవైవిధ్యంతోనే మానవ మనుగడ: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి*
*“జీవవైవిధ్య రచ్చ బండ” ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి అల్లోల*
*అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవ వర్చువల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి*
హైదరాబాద్, మే 22: జీవ వైవిధ్యంతోనే మానవ మనుగడ సాధ్యమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోకపోతే మానవ మనుగడ ప్రమాదంలో పడుతుందన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవ సందర్భంగా అరణ్య భవన్ లో రాష్ట్ర జీవవైవిధ్య మండలి నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. “మా పరిష్కారాలు ప్రకృతిలో ఉన్నాయి” అని గత ఏడాది నినాదానికి కొనసాగింపుగా “మేము పరిష్కారంలో భాగం” (We are part the Solution) అనే థీమ్ తో ఈ సంవత్సరం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. మనమందరం ప్రకృతితో కలసి సామరస్యంగా జీవించడమేనని పేర్కొన్నారు.
మానవ జీవితంపై ప్రకృతి విపత్తులు, కరోనా మహమ్మారులు ఒకదాని వెంట మరొకటి దాడి చేస్తూ.. మనుగడకు ముప్పు వాటిల్లజేస్తున్నాయని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం యధార్థాన్ని గ్రహించి మసలుకోవాల్సిన అవసరముందని, లేదంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే అవకాశముందన్నారు. అభివృద్ధి పేరుతో మనం ఇప్పటికే ఎంతో విలువైన ప్రకృతి సంపదను కొల్పోయామని, అయినా ఇప్పటికీ ఎంతో మిగిలివున్న ప్రకృతి సంపందను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషిపైనా ఉందన్నారు.
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు… పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణకు అధిక ప్రాధన్యతనిస్తూ… చేపట్టిన వివిధ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. హరితహార కార్యక్రమ ఫలితాలు ఇప్పుడు రాష్ట్ర మంతా మన కళ్లముందు కనిపిస్తున్నాయని వెల్లడించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం వల్ల తెలంగాణలో 4% పచ్చదనం పెరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా అమలు చేస్తున్న పునరుద్దరణ చర్యల వల్ల అడవుల్లో వృక్ష, జంతు జాతులు
బాగా వృద్ది చెందాయని తెలిపారు. తెలంగాణలోని అనేక ప్రాంతాలు వైవిధ్యభరితమైన జీవ, వృక్ష సంపదకు కేంద్రంగా ఉన్నాయన్నారు. ప్రత్యేక లక్షణాలను సొంతం చేసుకొని తెలంగాణకు తలమానికమైన మన్ననూరు తూర్పు పొడ ఎడ్లను స్వదేశి జాతి పరిరక్షణగా మన భారత ప్రభుత్వం గుర్తించిందన్నారు.
జీవవైవిద్య పరిరక్షణ చట్టం -2002ను ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో జీవవైవిధ్య యాజమాన్య కమిటీలు ఆయా ఆవాస ప్రాంతాల్లోని సంప్రదాయ, జీవవైవిధ్య వనరుల్ని సంరక్షించేందుకు తోడ్పాటునందించాలన్నారు. ప్రజలందరికీ జీవవైవిధ్య చట్టంపై అవగాహన కల్పించేందుకు “జీవవైవిధ్య రచ్చ బండ” (బయోడైవర్సిటీ చౌపాల్) అనే ప్రచార కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించామన్నారు. జీవవైవిధ్య, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న జీవవైవిధ్య మండలి అధికారులు, పర్యావరణవేత్తలకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు. పర్యావరణ
ఈ సమావేశంలో పీసీసీఎఫ్ ఆర్. శోభ, జీవవైవిధ్య మండలి సభ్య కార్యదర్శి కాళీచరణ్ యస్. కర్తాడే, మధ్యప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు మాజీ సభ్య కార్యదర్శి శ్రీనివాస మూర్తి, తదితరులు పాల్గొన్నారు.