(23.04.2022) కిసాన్ క్రెడిట్ కార్డు పథకం లబ్ధిదారులకు “కిసాన్ భగీదారి ప్రాథమిక హమారీ” కార్యక్రమంపై అవగాహన : ఎల్ డి ఎం. సురేష్ కుమార్

పత్రికా ప్రకటన.      తేది:23.04.2022, వనపర్తి.

కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కింద పంటల సాగు, పశుసంవర్డక, పాడి పరిశ్రమ, చేపల పెంపకం లబ్ధిదారులకు గ్రామ సభ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎల్ డి ఎం. సురేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ శాఖ, లీడ్ బ్యాంకు, నాబార్డు సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24వ.తేది నుండి మే 1వ. తేది వరకు “కిసాన్ భగీదారి ప్రాథమిక హమారీ” అనే ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ప్రయోజనాలను రైతులందరు పొందేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన సూచించారు.
పీఎం కిసాన్ లబ్ధిదారులను కె.సి.సీ.తో లబ్ధి పొందేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈ నెల 24వ. తేదీ నుండి వారం రోజుల పాటు బ్యాంకు అధికారులు, బ్యాంకింగ్ కరస్పాండెంట్ లు గ్రామాలలో పర్యటించి ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు, దీని ద్వారా రైతులకు వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల కిసాన్ క్రెడిట్ కార్డు (KCC, PMSBY/PMJJBY/APY) పథకానికి సంబంధించిన పంటల సాగు, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, చేపల పెంపకం తదితర అంశాలపై కొనసాగుతున్న కార్యక్రమాల ప్రయోజనాలను వివరిస్తున్నట్లు, జిల్లాలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post