(23.05.2022) ప్రజావాణి కార్యక్రమం : జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ బాష

పత్రికా ప్రకటన.   తేది:23.05.2022, వనపర్తి.
         జూన్ 2వ.తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష సూచించారు.
        సోమవారం ఐ.డి. ఓ.సి.భవనంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి, ప్రజల వద్ద నుండి ఆమె (30) ఫిర్యాదులను స్వీకరించారు.
       ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 2వ. తేదీన నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆమె అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరవుతారని ఆమె తెలిపారు.
      ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగవాన్, ఆదనపు కలెక్టర్ రెవిన్యూ డి.వేణుగోపాల్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post