(23.05.2022)10వ. తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ షేక్ యస్మి న్ బాష, జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్

పత్రికా ప్రకటన           తేది 23.05.2022, వనపర్తి.
       10వ. తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రశాంతంగా పరీక్షలు రాసే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు.
       సోమవారం వనపర్తి పట్టణంలోని 10వ.తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, లిటిల్ బర్డ్స్ పాఠశాలలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేయగా, అనూస్, సరస్వతి శిశు మందిర్, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కొత్తకోట పాఠశాలలను జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ సందర్శించారు.
       ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా వ్యాప్తంగా 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, మొత్తం 7,311 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నరని, 7 వేల 230 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 81 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు ఆమె వివరించారు. 99 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు ఆమె సూచించారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్ లను అనుమతించరాదని, విద్యార్థులు, ఇన్విజిలేటర్లు కోవిడ్ నిబందనలను పాటిస్తూ మాస్క్  ను తప్పకుండా ధరించాలని ఆమె సూచించారు. పరీక్షలకు హజరైన విద్యార్థులకు తెలుగు, హింది, ఉర్దూ మీడియాల వారిగా పశ్నాపత్రాలను సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆమె ఆదేశించారు. పరీక్షా కేంద్రంలో త్రాగు నీరు అందుబాటులో ఉంచాలని, ఎండ తీవ్రత వల్ల విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ కిట్లను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. విద్యార్థులు పరీక్షా సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
     జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్, జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ మధుకర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
………….
పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post