23.08.2021 Nalgonda Dist నల్గొండ,ఆగస్ట్ 23.జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ తహశీల్దార్ లను ఆదేశించారు.

నల్గొండ,ఆగస్ట్ 23.జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ తహశీల్దార్ లను ఆదేశించారు.
సోమవారం జిల్లా  అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్   జిల్లాలో ని  ఆర్డీఓ లు, మండల సర్వేయర్ లు, తహసిల్దారులతో వీడియో కాన్ఫి రెన్స్ నిర్వహించి ప్రభుత్వ భూముల రక్షణకు  రాష్ట్ర హై కోర్టు పిల్ నంబర్ 198/2020 పై ఆగస్ట్ 4 న జారీ చేసిన ఆదేశాల ప్రకారం జిల్లాలో నిర్దేశిత కాల పరిమితి లో ప్రభుత్వ భూముల సర్వే చేసి జియో మ్యాపింగ్ తో రికార్డ్స్, రిజిస్టర్ నిర్వహించాలని అన్నారు.మండలం వారీగా ల్యాండ్ బ్యాంకు వివరాలు ఆ రిజిస్టర్ లో నమోదు చేయాలని అన్నారు.తహశీల్దార్ లు సర్వేయర్ ల ద్వారా  ప్రభుత్వ భూముల సర్వే చేసి ల్యాండ్ బ్యాంకు వివరాలతో రిజిస్టర్ నిర్వహణ చేయాలని, నిర్ణీత ప్రొఫార్మా లో బంచ రాయి,సర్కారీ భూముల వివరాలు రూపొందించాలని,ఈ వివరాలు మండల సర్వేయర్ లకు జియో మ్యాపింగ్ కొరకు అంద చేయాలని అన్నారు.అదే విధంగా ఈ వివరాలు జిల్లా కలెక్టర్ కు,జిల్లా రిజిస్ట్రార్ కు,గౌరవ హై కోర్ట్ కు నిర్దేశిత ప్రొఫార్మా లో అంద చేయాలని అన్నారు.
ల్యాండ్ బ్యాంక్ ఇన్వెంటరీ ప్రకారం జియో మ్యాపింగ్ చేసి రికార్డు నిర్వహణ చేయాలని,15 రోజుల్లో తహశీల్దార్ లు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు.తదనంతరం సీలింగ్ భూముల రికార్డ్ రూపొందించాలని అన్నారు.
 సర్వే లాండ్స్ రికార్డ్స్ ఏ.డి. శ్రీనివాస్ మాట్లాడుతూ జియో మాపింగ్ ఎలా చేయాలి అని స్లైడ్స్ ద్వారా  వివరించారు.
ఈ వీడియో కాన్ఫ రెన్స్ లో ఆర్.డి.ఓ.లు జగదీశ్వర్ రెడ్డి, రోహిత్ సింగ్,గోపి రాం, కలెక్టరేట్ సుపెరింటెండెంట్ చంద్ర వదన తదితరులు పాల్గొన్నారు

Share This Post