Hon’ble Minister for Tourism & Culture and Sports.

పత్రికా ప్రకటన,

తేది. 15.06.2021.

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో టోక్యో లో జరగనున్న ఒలంపిక్స్ కు దేశం నుండి బ్యాడ్మింటన్ విభాగంలో ఎంపికైన  తెలంగాణ బిడ్డ సాయి ప్రణీత్ ను, వారి తల్లిదండ్రులను  ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు ప్రోత్సహకంగా  రాష్ట్ర క్రీడా శాఖ తరుపున 5 లక్షల రూపాయల చెక్కు ను బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీ సాయి ప్రణీత్ కు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి, క్రీడా సదుపాయాల కల్పనకు అనేక ప్రోత్సాహకాలను ప్రకటించారన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రీడాకారులకు 25 కోట్ల 87 లక్షల రూపాయలను నగదు ప్రోత్సాహకాలను అందించామన్నారు. వివిధ క్రీడా సంఘాలకు 9 కోట్ల రూపాయల ను అందించి క్రీడలను ప్రోత్సహిస్తున్నామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.

తెలంగాణ రాష్ట్రం ను క్రీడా హబ్ గా తీర్చిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్రీడా పాలసీ తయారీకి, క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ని   నియమించారన్నారు. వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ KTR గారి సహకారంతో పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీల CSR ఫండ్స్ ద్వారా వివిధ క్రీడల అభివృద్ధి కి కృషి చేస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రీడాకారులకు ఉన్నత విద్యా లో 0.5 శాతం, ఉద్యోగాలలో 2 శాతం రిజర్వేషన్లు ను అమలు చేస్తున్నామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. ఒలంపిక్స్, ప్రపంచ ఛాంపియన్స్ షిప్ లలో, కామన్ వెల్త్ లాంటి అంతర్జాతీయ స్థాయి వేడుకల్లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్నీ గతం కంటే ఎక్కువగా అందిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రం లో ఒలంపిక్స్ లో గోల్డ్ సాధించిన క్రీడాకారునికి 50 లక్షలు ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2 కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని అందజేస్తున్నామన్నారు, రజత పథకం సాధించిన క్రీడాకారులకు గతంలో 25 లక్షల రూపాయలు ఇస్తే నేడు ఒక కోటి రూపాయల ను అందిస్తున్నామన్నారు. కాంస్య పతకం సాధించిన క్రీడాకారులకు గతంలో 10 లక్షలు ఇస్తే నేడు 50 లక్షల రూపాయల నగదు  పురస్కారాలను క్రీడాకారులకు సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అందిస్తున్నామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.

టోక్యో ఒలంపిక్స్ లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనబర్చి పతకాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి క్రీడాకారులకు పిలుపునిచ్చారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.

ఈ కార్యక్రమంలో దేవరకద్ర శాసన సభ్యులు శ్రీ అల వెంకటేశ్వర రెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శ్రీ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, సాయి ప్రణీత్ తల్లిదండ్రులు, క్రీడా శాఖ ఉన్నతాధికారులు సుజాత, డా. నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Share This Post