పత్రికా ప్రకటన తేది.15.06.2021
కోవిడ్ -19 నియంత్రణకు పటిష్టమైన చర్యలతో గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు ముందున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి ఏర్పాటు చేసిన వెబ్నార్లో బి.ఆర్.కె.ఆర్. భవన్ నుండి ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా గాంధీ, వరంగల్ ఎంజిఎం ఆస్పత్రులను సందర్శించి రోగులతో సంభాషించారని, ఇది రోగులతో పాటు, వైద్యులలో కూడా మనోస్థైర్యాన్ని పెంచిందని పేర్కొన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి డైనమిక్ నాయకత్వంలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కొన్ని వినూత్న చర్యలు తీసుకుందని, ఫలితంగా దేశంలోని అనేక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే క్రియాశీల సానుకూల కేసులు తక్కువ రావడం మాత్రమే కాకుండా తక్కువ మరణాలు కూడా సంభవించాయన్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆరోగ్య శాఖను మానవ వనరులు, మౌలిక సదుపాయాలు మరియు ఇతర వ్యవస్థలతో పరిపుష్టం చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఇంకా, ప్రభుత్వ ఆసుపత్రులలోని అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. తగినంత ఆక్సిజన్ ట్యాంకర్లు కూడా సేకరించబడ్డాయని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి టెండర్లు కూడా పిలిచినట్లు తెలిపారు . మూడవ వేవ్ ఎదుర్కొవడానికి ప్రభుత్వం కూడా పూర్తిగా సన్నద్ధమైందని తెలిపారు.
టీకా కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భారత ప్రభుత్వం అందించే వ్యాక్సిన్ల సరైన వినియోగ కోసం రాష్ట్ర ప్రభుత్వం హై ఎక్స్ పొజర్ గ్రూప్ లో ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ప్రాతిపదికన టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు.
తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ Lessons learnt and future strategies on Covid-19 నిర్వహించిన వెబ్నార్లో ప్రముఖ డాక్టర్లు ఎయిమ్స్ డాక్టర్ గులేరియా, ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రిజ్వి, కాళోజి నారాయణ రావు హెల్త్ యూనివర్సిటి వైస్ చాన్సలర్ శ్రీ కరుణాకర్ రెడ్డి, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, టిఎస్ఎంసి చైర్మన్ డాక్టర్ రవీందర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
—————————————————————————-
జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం