24-08-2021 *కోవిడ్ నిబంధనలు ననుసరించి సెప్టెంబర్ 1 నుండి విద్యాసంస్థల పునఃప్రారంభంకు ఈ నెల 30 లోగా సన్నద్దం చేయాలి*

*:: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి*
*రాష్ట్ర పంచాయతిరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావు*
నల్గొండ,ఆగస్టు 24:-  కోవిడ్ నిబంధనలు అనుసరించి సెప్టెంబర్ 01 నుండి అన్ని విద్యా సంస్థలను రెగ్యులర్ తరగతులు పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఈ మేరకు  ఆగస్టు 30 వరకు విద్యాసంస్థల లో  అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి సన్నద్దం చేయాలని   రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు సంబంధిత అధికారులను ఆదేశించారు.విద్యాసంస్థల ప్రారంభం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల పై  రాష్ట్ర పంచాయతిరాజ్ శాఖ మంత్రి,రాష్ట్ర విద్యా శాఖ మంత్రులు రాష్ట్ర స్థాయి  ఉన్నతాధికారులతో కలిసి  జిల్లా కలెక్టర్ లు,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లు,విద్యా శాఖ,మున్సిపల్,పంచాయతీ రాజ్,ఆర్.డబ్య్లుఎస్ శాఖల అధికారులు,జడ్.పి.చైర్మన్ లు,మున్సిపల్ చైర్మన్ లు,స్థానిక ప్రజా ప్రతినిధులతో  మంగళవారం వీడియో  కాన్పరెన్సు నిర్వహించారు.
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ
 కరోనా  నుంచి కోలుకుంటున్న  నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఆయా ప్రభుత్వాలు విద్యాసంస్థల పున:ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలను, అనుసరిస్తున్న వ్యూహాలను సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి   కేసిఆర్ క్షుణ్ణంగా  పరిశీలించి  , రాష్ట్ర వ్యాప్తంగా కరోనా   కరోనా నియంత్రణలోకి వచ్చిందని వైద్యశాఖ అందించిన నివేదికలు అందించడంతో  సెప్టెంబర్ 1 నుంచి అంగన్ వాడి కేంద్రాలతో  సహా అన్ని రకాల విద్యాసంస్థలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు  ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని  తెలిపారు. కరోనా కారణంగా   గత 16 నెలలుగా  నిరంతరాయంగా  పాఠశాలలు  మూసివేయడంతో  పిల్లల్లో మానసిక వత్తిడి పెరిగుతున్నదని, అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిస్థితి ఉండే నేపథ్యంలో  సీఎం కేసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  పాఠశాలలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో  ఆగస్టు26 నుండి టీచర్లు వంద శాతం హాజరుకావాలని, పారిశుద్ద్య నిర్వహణ  పై ప్రత్యేక శ్రద్ద చుపించాలని  ,  ఉన్నతాధికారులు మరియు  ప్రజాప్రతినిధులు సమన్వయంతో  పనిచేసి  ప్రతి పాఠశాలను క్షేత్రస్థాయిలో  పరిశీలించి సిద్దం చేయాలని మంత్రి సూచించారు.
ప్రతి పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని,  అవసరమైన చోట నూతనంగా మిషన్ భగీరథ  ద్వారా పైప్ కనెక్షన్లు అందించాలని  మంత్రి సూచించారు. పాఠశాలల్లో గల కిచన్ షెడ్డులను ప్రత్యేకంగా శుభ్రపరచాలని  మంత్రి సూచించారు.  విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్క విద్యార్థి తప్పని సరిగా మాస్కులు ధరించి పాఠశాలలకు రావాలని అన్నారు.  జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో కూడా పారిశుద్ద్య చర్యలు చేపట్టేలా జిల్లా విద్యాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని , ప్రైవేట్ పాఠశాలల బస్సులలో విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకొవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆగష్టు 30 లోగా అన్ని విద్యాసంస్థలో  పూర్తి స్థాయిలో పారిశుద్ద్య చర్యలు నిర్వహించి ప్రారంభానికి సిద్ధంగా ఉంచినట్లు సంబంధిత ప్రధానోపాధ్యాయులు సర్టిఫికెట్ ను జారీ చేయాలని మంత్రి ఆదేశించారు.  పాఠశాలలు ప్రారంభం అయిన తర్వాత ప్రతి రోజు కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులు, జిల్లా పంచాయితీ అధికారులు, ఎం.పి.డి.వో.లు, మండల విద్యాధికారులు, మండల పంచాయితీ అధికారులు పాఠశాలలను సందర్శిస్తూ పారిశుద్ద్య చర్యలను కొనసాగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి  సూచించారు.
పాఠశాలలో  విద్యార్థి కోవిడ్ లక్షణాలతో ఉంటే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించాలని ప్రధానోపాధ్యాయులను మంత్రి ఆదేశించారు. విద్యార్థికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన పక్షంలో విద్యార్థి తరగతి గదిలో ఉన్న  ప్రైమరీ కాంటాక్ట్ విద్యార్థులను గుర్తించి అందరికి కొవిడ్ పరీక్షలు చేయించాలని మంత్రి సూచించారు.
*రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు* మాట్లాడుతూ అన్ని విద్యాసంస్థల్లో  పకడ్బందీ పారిశుద్ద్య చర్యలు చేపట్టి  సెప్టెంబర్ 01 న పాఠశాలలను ప్రారంభించాలని అన్నారు.  ప్రతి రోజు పాఠశాలల్లో పారిశుద్ద్య చర్యలు గ్రామ పంచాయితీ వర్కల ద్వారా నిర్వహించాలని ఆదేశించారు.  పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను ఉపాధిహామీ కూలీలతో తొలగించి శుభ్రపరచాలని, స్కూల్ ఆవరణలో  నిల్వ నీటిని లేకుండా మట్టి వేయించాలని, ఈగలు, దోమలు నివారణకు రసాయనద్రవాలు చల్లాలని అన్నారు.   పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలు, పూర్వ విద్యార్థుల కమిటీలు ఏర్పాటు చేసి పరిశుభ్రమైన పరిసరాలలో పాఠశాలల్లో విద్యా భోదన చేయుటకు చర్యలు తీసుకొవాలని సూచించారు. పూర్వ విద్యార్థుల నుండి విరాళాలు సేకరించి  పాఠశాలల్లో  అభివృద్ధి పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి  సూచించారు.
   గ్రామంలోని అన్ని ప్రభుత్వ సంస్థలో  పారిశుద్ద్య పనుల నిర్వాహణ భాద్యత గ్రామ పంచాయితీల దేనని నూతన పంచాయితీ రాజ్ చట్టంలో ఉందని  మంత్రి అన్నారు.  ప్రతి పాఠశాలల్లో త్రాగునీటి సరఫరా ఉండాలని,  త్రాగునీరు లేని పాఠశాలకు వెంటనే  సంబంధిత ఏ.ఈ.లు సందర్శించి మిషన్ భగీరథ నళ్లాలు అమార్చాలని ఆదేశించారు.  ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక మరమ్మత్తులు ఉంటే వెంటనే చేయించాలని అన్నారు.  పారిశుద్ద్య చర్యల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే  అధికారులు, ప్రజాప్రతినిధుల పై కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థుల విషయంలో చిన్న తప్పును కూడా సహించే ప్రసక్తి  ఉండదని మంత్రి  హెచ్చరించారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కెంద్రాల డాక్టర్లతో సమన్వయం చేసుకొవాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల ననుసరించి సెప్టెంబర్ 1 నుండి అన్ని విద్యా సంస్థలు రెగ్యులర్ తరగతులు పునః ప్రారంభానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు జిల్లాలో ప్రభుత్వ, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలు, ప్రైవేట్, ఎయిడెడ్,ఆన్ ఎయిడెడ్, రెసిడెన్షియల్, మినీ గురు కుల ,ఆశ్రమ పాఠశాలలు,కె.జి.బి.వి,నవోదయ,కేంద్రీయ విద్యాలయ,మదరసా లు,గుర్తింపు లేని,మూగ,చెవిటి,ఆదర్శ ,ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలలు అన్ని 2046 పాఠశాలల్లో 2,51,166 మంది విద్యార్ధిని ,విద్యార్థులు చదువు తున్నారని అన్నారు. ప్రతి విద్యా సంస్థలో పారిశుధ్యం,త్రాగు నీరు,విద్యుత్ సౌకర్యం తదితర ఏర్పాట్లు 4 రోజుల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ వి.సి.లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,నల్గొండ మున్సిపల్ చైర్మన్ ఎం.సైది రెడ్డి, డి.ఈ. ఓ.భిక్ష పతి,జడ్.పి.సి.ఈ. ఓ.వీర బ్రహ్మ చారి,ఆర్.డబ్ల్యు.ఎస్.ఎస్.ఈ. సురేష్ తదితరులు పాల్గోన్నారు.

Share This Post