(24.11.2021) వేసెక్టమి శస్త్ర చికిత్సల పక్షోత్సవాలు గోడ పత్రికలు విడుదల : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన. తేది:24.11.2021, వనపర్తి.

కుటుంబ నియంత్రణలో పురుషుల పాత్ర కీలకమని, నియంత్రణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేపట్టి, అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో వేసెక్టమి శస్త్ర చికిత్సల పక్షోత్సవాలు (15 రోజులు) నవంబర్ 21వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు నిర్వహించే గోడ పత్రికలు జిల్లా కలెక్టర్ చేతుల మీదగా ఆవిష్కరించినట్లు ఆమె తెలిపారు. “పురుషులు కుటుంబ నియంత్రణను స్వీకరించారు – సంతోషకరమైన కుటుంబానికి పునాది వేశారు” అనే నినాదంతో అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.
వేసెక్టమీ పురుషులకు చేసే అతి సులభమైన, సురక్షితమైన కోతకుట్టు లేని చిన్న ఆపరేషన్ అని ఆమె తెలిపారు. వేసెక్టమీ శస్త్రచికిత్సలపై అపోహలు, మూఢనమ్మకాలు విడనాడాలని ఆమె వివరించారు. కుటుంబ నియంత్రణకు స్త్రీలకు ఓరల్ పిల్స్, ఐ యు సి డి, పి పి ఐ యు సిడి, ఎం పి ఏ. అంతర ఇంజక్షన్, అదేవిధంగా పురుషులకు నిరోద్ వంటివి ఉపయోగించడంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. కుటుంబ నియంత్రణకు శాశ్వత పద్ధతులు పురుషులకు వ్యాసెక్టమీ, ఎం ఎస్ వి, స్త్రీలకు ట్యూబెక్టమీ, డి పి ఎల్, వంటివి పాటించినట్లయితే కుటుంబ నియంత్రణకు సహకరించిన వారు అవుతారని ఆమె అన్నారు. డిసెంబర్ 3వ తేదీన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణపై క్యాంపు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సూచించారు.
జనాభా పెరగకుండా నియంత్రించుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని స్త్రీ, పురుషులలో అవగాహన కల్పించి చిన్న కుటుంబం యొక్క ప్రాధాన్యత తెలియజేయాలని ఆమె తెలిపారు. అందుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు పదిహేను రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు సహకరించి నిబద్ధతతో వాటిని పాటించాలని, తద్వారా సంతోషకరమైన కుటుంబాన్ని గడుపుతారని ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ చందు నాయక్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ శ్రీనివాసులు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రవిశంకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post