(24.11.2021) MGNREGS పనుల పురోగతిపై సమావేశ : జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వన్

పత్రికా ప్రకటన. తేది.:24.11.2021, వనపర్తి.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం చేపట్టిన పనులలో పురోగతి సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఎం.పి. ఓ.లు, ఏ పీ ఓ లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి బోనాలు, తెలంగాణకు హరితహారం, కూలీలకు వేతన చెల్లింపు లు (Labour Payments), కూలీల సంఖ్య పెంపుదలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి తగు సూచనలు చేశారు. కూలీలకు సంబంధించిన నివేదికలు, లేబర్ బడ్జెట్ వివరాలను వెంటనే నమోదు చేయాలని, పనులలో జాప్యం లేకుండా, సామర్థ్యం పెంచేందుకు అనుగుణంగా కూలీలను పెంచి అనుకున్న సమయానికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. కూలీలకు ఎలాంటి జాప్యం లేకుండా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా ప్రభుత్వం చేపట్టిన పనులలో పురోగతి సాధించాలని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ నరసింహులు, డి పి ఓ. సురేష్ కుమార్, అడిషనల్ డి ఆర్ డి ఓ కృష్ణయ్య, ఏ.పీ.ఓ.లు, డి ఆర్ డి ఓ, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post