25 న కరీంనగర్ లో   TCS ఉద్యోగాల భర్తీ కోసం  రాత పరీక్ష జిల్లా లోని  నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భా

25 న కరీంనగర్ లో   TCS ఉద్యోగాల భర్తీ కోసం  రాత పరీక్ష

 

జిల్లా లోని  నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

 

జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష

 

-0000-

 

ప్రముఖ ప్రైవేట్ కంపెనీ టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈరోజు ఈనెల 25న కరీంనగర్ లో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష ఒక ప్రకటనలో తెలిపారు.  కరీంనగర్ వావిలాల పల్లి లోని వివేకానంద డిగ్రీ పీజీ కళాశాల లో ఉద్యోగాల భర్తీ కోసం  ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 03.00 గంటల వరకు రాత పరీక్ష ఉంటుందన్నారు. 2021, 2022 , 2023 సంవత్సరంలో  రెగ్యులర్ విధానంలో BBA, BCom, BSc జనరల్ (CS మరియు IT మినహా), BA, BBM, BAF, BBI కోర్స్ లలో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు.  నిర్దేశిత కోర్స్ లలో 50%/5 CGPA లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ సాధించి ఉండాలన్నారు.  2 సంవత్సరాల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదనీ, పెండింగ్ బ్యాక్‌లాగ్‌లు ఉండకూడదని అన్నారు. జిల్లాలోని అర్హత, ఆసక్తికలిగిన నిరుద్యోగ యువతీ యువకులు  తమ బయోడేటా,విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్స్ , అభ్యర్థి తాజా పాస్ పోర్ట్ సైజ్ ఫోటో,  ఏదేని ప్రభుత్వ గుర్తింపు కార్డ్ ( ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు) లతో కరీంనగర్ లోని వావిలాల పల్లి   వివేకనంద డిగ్రీ , PG కాలేజీ నందు   తేదీ 25-05-2023రోజున ఉదయం9.00గంటలకు ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్షకు హాజరు కావాల్సిందిగా నిరుద్యోగ యువత ను జిల్లా కలెక్టర్ కోరారు.

Share This Post