25.08.2021 Nalgonda Dist సెప్టెంబర్ ఒకటి నుండి విద్యా సంస్థలు ప్రారంభం చేయనున్నందున ప్రభుత్వ పాఠశాలలు

నల్గొండ, ఆగస్ట్ 25. సెప్టెంబర్ ఒకటి నుండి విద్యా సంస్థలు  ప్రారంభం చేయనున్నందున ప్రభుత్వ పాఠశాలలు,వసతి గృహలకు సన్న బియ్యం,నిత్యావసర సరకులు సరఫరా కు సంబంధించిన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం అదనపు జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం లో డి.ఈ. ఓ.,జిల్లా పౌర సరఫరాల అధికారి,పౌర సరఫరాల డి.యం.,సంక్షేమ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమావేశమై సమీక్షించారు.జిల్లా విద్యా శాఖ అధికారి పాఠశాల లలో మధ్యాహ్న భోజనం కు,సంక్షేమ శాఖ ల అధికారులు వసతి గృహాల్లో బియ్యం సరఫరాకు ఇండెంట్ రూపొందించి ఈ పి.డి.ఎస్.లో నమోదు చెయాలని అన్నారు.ఈ. పీడీస్ లో ఇండెంట్ ప్రకారం ఆర్.ఓ.జనరేట్ చేసి పాఠశాలలకు బియ్యం సరఫరాకు ఈ నెల 30 లోగా ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల డి.యం.ను ఆదేశించారు. ఎం.ఎల్.ఎస్ పాయింట్ ల నుండి హాస్టళ్లకు బియ్యం పంపిణీ కి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని డి.యం.కు సూచించారు. గోదాం.లలో బియ్యం నిల్వలు ఉంచు కోవాలని అన్నారు.నిత్యావసర సరుకులు పాత కాంట్రాక్టర్ ద్వారా సెప్టెంబర్ ఒకటి నాటికి సరపరా చేసేలా సంబంధిత అధికారులు తగు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు.
పాఠశాలలు,వసతి గృహాలు ఆవరణ లో పరిశుభ్రం గా ఉండేలా పంచాయతీ సిబ్బంది తో సమన్వయం చేసుకోవాలని,త్రాగు నీరు ,తదితర ఏర్పాట్లు చేయాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల డి.యం.నాగేశ్వరరావు, డి.ఈ. ఓ.భిక్షపతి,సాంఘిక సంక్షేమ శాఖ డి.డి.సల్మా భాను, ఇతర అధికారులు పాల్గొన్నారు

Share This Post