తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో ఓపెన్ ఇంటర్ అడ్మిషన్ పొందేందుకు ఈ నెల 17 తేదీ నుండి సెప్టెంబర్ 10 వ తారీకు వరకు నిర్ణీత రుసుము తో అడ్మిషన్ పొందే అవకాశం కల్పించిందని, ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 23 వ తారీకు వరకు అడ్మిషన్ పొందే అవకాశం కల్పించిందని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల కోఆర్డినేటర్ కె.నరేంద్ర కుమార్ తెలిపారు.చదువు మధ్యలో ఆపేసిన వారు,ఆర్థిక ఇబ్బందులతో రెగ్యులర్ చదువు కొనసాగించలేని వారు ఓపెన్ ఇంటర్ చేసుకునే అవకాశం ఉన్నదని తెలిపారు.ఓపెన్ ఇంటర్ అడ్మిషన్స్ పొందాలనుకునేవారు కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నేరుగా సంప్రదించగలరు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.