పరిశుభ్రతగా లేని ఖాళీ స్థలాలపై చర్యలు తీసుకుంటాం


ప్రచురణార్థం

పరిశుభ్రతగా లేని ఖాళీ స్థలాలపై చర్యలు తీసుకుంటాం…

మహబూబాబాద్, జూలై .5

ఖాళీ స్థలాల యజమానులు పరిశుభ్రత పాటించకపోతే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వి.పీ గౌతం హెచ్చరించారు.

సోమవారం పట్టణం మున్సిపల్ పరిధిలోని 30వ వార్డు గుండ్లకుంట కాలనీలో కలెక్టర్ పర్యటించి ఐదవ రోజు పట్టణ ప్రగతి పనులను స్వయంగా సందర్శించి పరిశీలించారు.

లోతట్టు ఖాళీ స్థలాలలో వర్షపు నీరు నిలిచి దోమలు పెరిగిపోతున్నాయని, పందులతో దుర్వాసన వెదజల్లుతున్నదని, బురదలో దొర్లిన పందులు ఇళ్లలోకి కూడా వస్తున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ అధికారులను ఆదేశిస్తూ కాలనీలో 30 ఖాళీ స్థలాలు ఉన్నాయని వాటిలో కొన్ని స్థలాల్లో నిల్వ ఉన్న నీటిని కలెక్టర్ పరిశీలిస్తూ తరలింప చేసేందుకు సంబంధిత యజమానులను పిలిపించి తక్షణ చర్యలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు సోకక ముందే శరవేగంగా పనులు చేపడుతూ పరిశుభ్ర పరచాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

లేనిపక్షంలో వార్డ్ కౌన్సిలర్ మునిసిపల్ అధికారులు సంయుక్తంగా పనులు చేపట్టి స్థలాల యజమానుల నుండి జెసిబి, ట్రాక్టరు కిరాయిలను మొరం, కూలీల ఖర్చును వసూలు చేస్తూ రెండు రెట్లు జరిమానా విధించాలని తెలిపారు

వీధి లైట్లు ఏర్పాటు చేయించాలని నీటి కొరత ఉన్నందున పంపు కనెక్షన్లు ఇవ్వాలని కనీసం బోర్ వెల్ అయినా వేయించాలని కలెక్టర్ కు విన్నవించుకోగా వీధిలైట్లు సత్వరమే ఏర్పాటు చేస్తామని పందుల తరలింపుకు ప్రజలు సహకరించాలన్నారు.

వార్డులోని ప్రతి వీధిని కలెక్టర్ స్వయంగా పాదయాత్ర చేస్తూ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు.

ఖాళీ స్థలాలను పరిశీలిస్తూ చెత్తాచెదారం తొలగిస్తూ విశాలమైన ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కలు మొలువకుండా క్రీడా మైదానంగా వినియోగించుకోవాలని సూచించారు.

ఇళ్ల నిర్మాణాలలో వినియోగిస్తున్న ఇటుకలు, మట్టి కాలువలో వేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.కాలనీలో ఉన్న మంచినీటి బావిని పరిశీలిస్తూ ప్రజల కోరిక ప్రకారం వినియోగంలోకి తీసుకురావాలన్నారు.

అనంతరం నాలుగో వార్డు గాంధీపురం లో చేపడుతున్న మెగా హరితహారంను కలెక్టర్ సందర్శించారు ఎకరం 30 కుంటలలో గుంతలు తవ్వుతున్న పనులను పరిశీలించారు అదే స్థలంలో ఉన్న ఇటుక బట్టి సందర్శిస్తూ ఖాళీగా ఉన్న షెడ్డు నిర్మాణాలను తక్షణం తొలగించాలని, నీటిని వినియోగించుకునేందుకు బావిని శుభ్రపరిచి బావి చుట్టూ గోడ నిర్మాణం చేపట్టాలన్నారు. కూలీలు బ్యాగులో నింపుతున్న మట్టిని పరిశీలిస్తూ ఇసుక, పేడ, ఎరువు లను మిశ్రమంగా చేసి బ్యాగులు నింపాలని నిర్వాహకులకు సూచించారు.

ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ నరేందర్ రెడ్డి వార్డు ప్రత్యేక అధికారి అనిల్ కుమార్ 30వార్డు కౌన్సిలర్ విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.
————————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post