ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది :: రాష్ట్ర పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్ శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు
పత్రికాప్రకటన తేదిః 06-07-2021
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది :: రాష్ట్ర పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్ శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు
జగిత్యాల, జూలై 06: ప్రైవేటు విద్యా వసతులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్ శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం కోరుట్ల నియోజక వర్గంలో2 కోట్ల 6 లక్షల50 వేలతో మాదాపూర్ నుండి కట్లకుంట వయా చిన్నమెట్పల్లి మీదుగా 3.75 కి.మి బిటి రోడ్డు, 3కోట్ల 90 లక్షలతో మాదాపూర్ నుండి కట్లకుంట వయా చిన్నమెట్పల్లి మీదుగా 10.37 మీటర్లతో నిర్మించిన బ్రిడ్జి, మరియు 4.16 కి.మి పోడవుతో 2 కొట్ల 30 లక్షల 20 వేల వ్యయంతో నిర్మించిన వెల్లుల నుండి కొండ్రికల్ వయా మాసాయిపేట వరకు గల రోడ్డు మార్గానికి, 6 కోట్ల 42 లక్షల 30వేలతో 8.15 కి.మి పొడవున బండలింగాపూర్ Xరోడ్దు నుండి ఆత్మకూర్ వయా జగ్గాసాగర్ వరకు నిర్మించిన రోడ్డుకు, 3 కోట్ల 83 లక్షల 40వేలతో ఇబ్రహీంపట్నం నుండి నడికుడ వయా యామాపూర్, ఫకీర్ కొండాపూర్ గ్రామం వరకు 6.99 కి.మి పొడవుతో నిర్మించిన రోడ్డు మార్గాలకు శంకుస్థాపనలు, కోరుట్ల మండలం సంగెం గ్రామంలొ, 33/11 కె.వి విద్యూత్ సబ్ స్టేషన్, సంగెం, వెల్లుల, మెట్లచిట్టాపూర్ మరియు చౌలమద్ది గ్రామాలలో 22లక్షల వ్యయంతో నిర్మించిన ఒక్కొ రైతువేధికను, వెల్లుల పల్లెప్రకృతి వనాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖా మాత్యులతో కలిసి ప్రారంబించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలలకు పిల్లల తల్లితండ్రులు ఆకర్షితులై, ప్రైవేటు పాఠశాలలలో పిల్లల చదువును హోదాగా బావించి ఫీజులు కట్టలేక తల్లితండ్రులు ఇబ్బందులు పడకుండా ఎంతటి ఖర్చుకై వెనకాడకుండా ప్రైవేటు దీటుగా ఆన్ని వసతులు, ఆదునిక హంగులతో పాఠశాలల నిర్మాణాం దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని మంత్రి తెలిపారు. ముందుగా మండలానికి 5 పాఠశాలలను తీసుకుని వాటిని అభివృద్ది చేసి, పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికబారం ఉన్నప్పటికి, పేదలకు ఏమాత్రం ఇబ్బందులు తలెత్తకుండా వారికి చెందాల్సిన పించన్, రైతుబందు, డబ్బులను వారి ఖాతాలలో జమచేసిందని, కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ లను కూడా సకాలంలో అందించిన రాష్ట్రం దేశంమొత్తంలొ తెలంగాణ మాత్రమేనని అన్నారు. ఒక్క ఊరికి మాత్రమే 13 లక్షల పించన్ డబ్బులను ప్రతినెల చెల్లించడం జరుగుతుందని స్పష్టం చేశారు. వృద్దులకు గౌరవం పెంచేలా వృద్దాప్య పించన్ అందిస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనని పేర్కోన్నారు. గ్రామంలో ఇంటింటి నుండి ట్రాక్టర్ ద్వారా తడి,పోడి చేత్తను వేరువెరుగా స్వీకరించి వాటితో కంపోస్టు ఎరువును తయారు చేసుకొవడం వలన మంచి ఎరువుతో పాటు గ్రామపంచాయితికి లాభం వస్తుందని తెలియజేశారు. భారత దేశ౦లో అత్యదిక పెన్షన్లు ఇచ్చింది ఒక తెలంగాణ మాత్రమేనని పేర్కోన్నారు. గ్రామపంచాయితీల వేయి కోట్లు మంజూరు చేయండం జరిగిందని తెలిపారు. మెట్ల చిట్టా పూర్ మోడల్ విలేజీ కేంద్ర ప్రభుతం అవార్డు పొందినది ఆదర్శ గ్రామంగా నిలచి 100% పనులు( ఇంకుడు గంతలు, మరుగుదోడ్లు, మొదలగు) పూర్తి చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. మరిన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి కోరుట్ల నియోజక వర్గఅభివృద్దికి అధనంగా 5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
సంక్షేమ శాఖ మాత్యులు కోప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, పల్లె ప్రగతి కార్యక్రమాల ప్రగతిపై దృష్టిసారించి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ప్రదాన ఉద్దేశ్యం అనేక రోజులుగా నిర్లక్ష్యానికి గురై సరైన వసతులు లేని గ్రామాలను బాగు చెయాలనేదే పల్లే ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమమని అన్నారు. పెరుకుపోయిన సమస్యలను పరిష్కించేదిశగా , గ్రామాలు, పట్టణాలలో ఉండాల్సి మౌళిక సదుపాయలను కల్పించే దిశగా ప్రగతి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని గ్రామంలో చెత్తను తొలగించడానికి, ట్రాక్టర్, ప్రతి ఇంటిక మంచినీరు, చెట్లకు నీరుపోసుకోవడానికి ట్యాంకర్, చనిపోయిన వారికి గౌరవ ప్రదంగా దహన సంస్కరాలు జరిగేలా వైకుఠదామాలు, పల్లెప్రకృతి వనాల, విద్యూత్ సమస్యల పరిష్కారం, చెత్తాచెదారం లేకుండా చేయాలనే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పండించిన పంటకు కోనుగోలు కేంద్రాల ద్వారా అమ్మిన వెంటనే డబ్బులు బ్యాంకుఖాతాలలో జమచెయడం జరిగుతుందని అన్నారు. దేశంలో వరిని ఘననీయంగా పండించిన రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్నామని అన్నారు. రానున్న రోజులలో ఉచితి, నాణ్యమైన విద్యా, ఉచిత వైద్యం అందించడంలో మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించే దిశగా అడుగులు వేయడం జరుగుతుందని పేర్కోన్నారు. ఇప్పటికే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిచేసుకోని సమృద్దిగా నీటి నిలువలు సమకూర్చుకోవడం జరిగింది ప్రగతి కార్యక్రమాల అమలులో కూడా మొదటిస్థానం పొందామని అన్నారు. మొక్కబడిగా కాకుండా5లక్షల 5వేలతో డబుల్ బెడ్ రూం నిర్మాణాలకు కేటాయించడం జరిగిందని, ఇళ్లనిర్మాణాలు తలెత్తడంతో ఎవరి స్థలంలో వారే డబుల్ బెడ్ రూం కట్టుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ డబ్బులనకు కూడా వారి ఖాతాలోనే జమచేయడం జరుగుతుందని, ఆదిశగా బడ్టెట్ 11వేల కోట్లను మంజూరు చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. ప్రభుత్వ సహయం పొందని వారు ఒక్కరు కూడా లేకుండా ప్రభుత్వం అన్ని విధాల సహయాన్ని అందిస్తుందని పేర్కోన్నారు. 99% ప్రభుత్వ ఆసుపత్రిలో సురక్షితంగా ప్రసవం చేయడంతో పాటు ఆడపిల్ల పుడితే 13వేలు, మగపిల్లలు పుడితే 12 వేలు ఇచ్చి 18 వస్తువులతో కేసిఆర్ కిట్ ఇచ్చి అంబులెన్స్ లో ఇంటికి తీసుకువెళ్లి దించడం జరుగుతుందని, ఓటరిమహిళలకు 80 వేల మందికి పించన్ ఇవ్వడం జరుగుతుందని పేర్కోన్నారు. 57 సంవత్సరాలు నిండి, రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా వచ్చే నెల నుండి పించన్లను అందించేలా కృషి చేయడం జరుగుతుందని పేర్కోన్నారు. గ్రామ రూపురేఖలను మెట్లచిట్టాపూర్ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలిచిందని, ఒకప్పుడు నిజామాద్ జిల్లా అంకాపూర్ గ్రామాన్ని చెప్పుకునే వారని, కాని ఇప్పుడు జిల్లాలో అనేక గ్రామాలు ఆదర్శ గ్రామాల వైపు పయనిస్తున్నాయని పేర్కోన్నారు.
జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ,చిన్న మెట్పల్లి 4వ విడత పల్లెప్రగతి, PMGSY రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమాలకు విచ్చేసిన మంత్రివర్యులకు కృతజ్ఞతలను తెలియజేస్తూ, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా విరిగిన, పనికిరాని విద్యూత్ స్థంబాలను తొలగించడం, లూస్ వైర్లను పునరుద్దరణ చేయడం వంటి కార్యక్రమాలతో పాటు మిగిలి న కార్యక్రమాలపై దృష్టి సారిచడం జరుగుతుందని, పల్లెప్రకృతి వనం, కాంపోస్ట్ షెడ్, పల్లెప్రకృతి వనాలచుట్టు బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, రోడ్లకు ఇరువైపుల ఎవెన్యూ ప్లానిటేషన్ కార్యక్రమకంలో బాగంగా చిన్న మొక్కలు కాకుండా నర్శరీల నుండి పెద్ద మొక్కలను తెప్పించి నాటించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పెర్కోన్నారు.
కోరుట్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల పారిశుద్ద్య నిర్వహణ కొరకు ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ను ఇచ్చారని, గ్రామ పంచాయితీల అభివృద్దే దేశ అభివృద్ది సాద్యమవుతుందని నిధులను సమకూర్చారని అన్నారు. కరోనా విపత్కర పరీస్థితులను ఎదుర్కోంటు రైతుబందు, పెన్షన్లకు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత, గ్రామ సర్పంచ్ గంగరాజు, యంపిపి తోట నారాయణ, జట్పిటిసి లావణ్య, యంపిటిసి విజయ, రైతుసమన్వయ సమిత అద్యక్షులు , స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది