26.04.2022-పత్రికా ప్రకటన :: జిల్లా కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా గారి ఆదేశానుసారం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ, జిల్లాలోని యువజన సంఘాలు మరియు స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) భువనగిరి నందు జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి, IAS గారు, శ్రీ నాబోయిన ఆంజనేయులు, మునిసిపల్ చైర్మన్, భువనగిరి గారు , జిల్లా అధికారులు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కే ధనంజనేయులు, DRDO PD మందడి ఉపేందర్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ జిల్లా సుపరిండెంట్ నవీన్ మరియు జిల్లా మేనేజరు సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారి, గోపికృష్ణ గారి, జిల్లా షెడ్యూల్ కులాల కార్పొరేషన్ అధికారి శ్యామసుందర్ గారు తో మరియు యువజన సంఘల సభ్యులతో తో కలసి ప్రారంబించారు.

ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో 18 నుండి 55 సంవత్సరాలు కలిగిన యువత సుమారు (150) మంది పైగా పాల్గొని వారి రక్తమును దానం చేసారు. ఇట్టి ఈ కార్యక్రమములో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలాసత్పతి, ఐఏఎస్ గారు మాట్లాడుతూ ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ముఖ్య ఉద్దేశ్యం తలసీమియా వ్యాధి గ్రస్తులకు ప్రతి 15 నుండి 21 రోజుల లోపు బ్లడ్ ను అందించాలని, తలసేమియా వ్యాది పై అవగాహన వుండాలని, ప్రతి ఒక్కరు తలసేమియా పరీక్ష చేసుకోవాలని తెలిపినారు. మరియు వారి యొక్క జీవన గమనం ముందుకు సాగదు అని కావున దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ, జిల్లా లోని యువజన మరియు సంఘాలు స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు తలసేమియా వ్యాధి గ్రస్తులకు వారి జీవనానికి ఎంతో సహాయకారిగా ఉంటుంది అని వారు ఈ సందర్బంగా తెలుపుతూ నిర్వహించిన వారికీ అభినందనలు తెలిపినారు.
జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కే ధనంజనేయులు గారు మాట్లాడుతూ జిల్లా యువజన మరియు క్రీడల శాఖ, జిల్లాలోని యువజన సంఘాలు మరియు స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుకు స్పందించి పాల్గొని రక్తమును దానం చేసిన వారికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తు వీరు చేసిన రక్తదానము తలసేమియా వ్యాధి గ్రస్తులకు ఇది ఎంతగానో ఉపయౌగపడుతుంది అని వారు అన్నారు. ముఖ్యంగా అధికంగా సహకరించి పాల్గొన్న జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి మరియు వారి సిబ్బందికి అలాగే సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారి మరియు వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపడం జరిగినది.
ఇట్టి ఈ కార్యక్రమములో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలాసత్పతి, ఐఏఎస్ గారు, ఏనాబోయిన ఆంజనేయులు, మునిసిపల్ చైర్మన్, భువనగిరి గారు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కే ధనంజనేయులు గారు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి గారు, జిల్లా షెడ్యూల్ కులాల కార్పొరేషన్ అధికారి శ్యామసుందర్ గారు, జిల్లా సివిల్ సప్లై కార్పోరేషన్ ఆఫీసర్ గోపికృష్ణ గారు, జిల్లా ఎక్సైజ్ శాఖ జిల్లా సుపరిండెంట్ నవీన్ గారు మరియు యువజన సంఘాల సభ్యులు కరుణ్, డా శివ ప్రసాద్ DIEO సంజీవ గారు, ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) భువనగిరి ప్రిన్సిపాల్ పాపిరెడ్డి గారు మరియు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.

Share This Post