(26.07.2022) ఈ నెల 26, 27, 28 తేదీలలో ఆర్థిక నిర్వహణ, ఖాతాలు, ఆడిట్, బడ్జెట్ రికార్డుల నిర్వహణపై శిక్షణ : జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్

పత్రికా ప్రకటన      తేది:26.07.2022, వనపర్తి.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ శాఖలకు ఈ నెల 26, 27, 28 తేదీలలో ఆర్థిక నిర్వహణ, ఖాతాలు, ఆడిట్, బడ్జెట్ తదితర రికార్డుల నిర్వహణపై అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆయా శాఖల అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ ఆదేశించారు.
మంగళవారం ఐ డి ఓ సి ప్రజావాణి సమావేశమందిరంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన రికార్డులపై శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా శాఖలకు సంబంధించిన రికార్డుల నిర్వహణ వివరాలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని, వాటిని ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆయన సూచించారు. ఈ నెల 26, 27, 28 తేదీలలో ఆర్థిక నిర్వహణ, ఖాతాలు, ఆడిట్, బడ్జెట్ తదితర రికార్డుల నిర్వహణపై మూడు రోజులపాటు శిక్షణను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో మొదటి రోజు ఆర్థిక నిర్వహణపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సూపరింటెండెంట్  శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 13 శాఖలకు సంబంధించిన రికార్డులను ఏ ఏ రికార్డులను ఎలా నమోదు చేయాలి, బడ్జెట్ వివరాలను, వాటికి సంబంధించిన నియమ, నిబంధనలను సిబ్బందికి ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి ఐ ప్రాంతీయ శిక్షణ కేంద్రం మహబూబ్నగర్ శాఖ మేనేజర్ గోపాల్ గౌడ్, డి ఎం హెచ్ ఓ సూపరింటెండెంట్ శ్రీధర్ రెడ్డి, పంచాయతీ రాజ్, డి డబ్ల్యూ ఓ, ఆర్డబ్ల్యూఎస్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, తదితర పదమూడు శాఖల సిబ్బంది, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post