(26.07.2022) కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాల ఆకస్మికంగా తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
తేది:26.07.2022, వనపర్తి.

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలలో చదివే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి, నాణ్యమైన భోజనము అందించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సంబంధిత అధికారులకు ఆదేశించారు.
మంగళవారం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో పరిసరాలను పరిశీలించి, ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, త్రాగునీరు, తదితర వసతులు కల్పించాలని ఆమె తెలిపారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలని ఆమె సూచించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని, మధ్యాహ్న భోజనం, తదితర రికార్డులను ఆమె పరిశీలించారు. విద్యార్థులలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. జ్వరం ఉన్న విద్యార్థుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ వెంట డి.డబ్ల్యూ.ఓ. పుష్పలత, కేజీబీవీ పాఠశాల సిబ్బంది, సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి జారీ చేయబడినది.

Share This Post