(26.07.2022) మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి : జిల్లా అదనపు కలెక్టర్ ఆసిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన
26 7 2022
వనపర్తి

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించి వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ ఆసిష్ సంగ్వాన్ హాస్టల్ ప్రిన్సిపాల్ లకు ఆదేశించారు. మంగళవారం పెద్దమందడి మందులు జగత్ పల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించి హాస్టల్ నిర్వహణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన వేడి వేడి ఆహారం అందించాలని నిర్వాహకులకు ఆదేశించారు. హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పెద్దమందడి లోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో అదనపు కలెక్టర్ మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాస్,డి ఎల్ పి ఓ, ఎంపీడీవో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు..

… జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి చేజారి చేయబడినది.

Share This Post