26-08-2021: ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఏదైనా సాధ్యమే – కలెక్టర్

ఆగస్టు 26-08-2021:
నిజామాబాద్(వినాయక్ నగర్), జక్రాన్ పల్లి,

నిర్దిష్టమైన లక్ష్యంతో పని చేస్తే ఏదైనా సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు.

గురువారం స్థానిక వినాయక్ నగర్లోని రుక్మిణి చాంబర్స్ లో దేశ్పాండే ఫౌండేషన్, కాకతీయ సైన్ బోర్డ్
ఆధ్వర్యంలో పని చేస్తున్న ఆగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరియు 9.ఎన్ జి వోస్ సంస్థ ద్వారా 6 నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇస్తున్న శిక్షణను పరిశీలించారు. వారికి ఏ విధంగా శిక్షణ అందిస్తున్నారో విద్యార్థులను స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం జక్రాన్ పల్లి మండలం పూప్పాలపల్లి గ్రామంలో దేశ్పాండే ఫౌండేషన్ సలహాలతో రైతు ప్రభాకర్ చేస్తున్న శ్రీ వరి సాగును పరిశీలించారు. రైతుతో మాట్లాడి శ్రీ వరిసాగు కు ఫర్టిలైజర్, ఇతర మందుల వాడకం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకేసారి వాడినట్లు రైతు తెలిపారు. సాధారణ వరి సాగుకు ఫర్టిలైజర్ ఎక్కువ వాడడం జరిగిందని తెలిపారు.

కలెక్టర్ వెంబడి దేశ్పాండే ఫౌండేషన్ పౌండర్ రాజిరెడ్డి సామా ఫణీంద్ర.,
సీఈవో వివేక్ Tie సెక్రెటరీ రవిష్ అగస్త్య ఫౌండేషన్ నిజామాబాద్ ఏరియా ఇనుచార్జ్ శ్రీదేవి మేనేజర్ వీరేశ్ పాణి ఎండిఓ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post