(26.10.2021) మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రత్యామ్నాయ పంటలపై సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.          తేది:26 .10 .2021, వనపర్తి

వచ్చే యాసంగి పంట లో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేసి లబ్ధి పొందాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు.

మంగళవారం మదనాపురం లోని కృషి విజ్ఞాన కేంద్రం లో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాసంగి పంట లో రైతులు ఇతర పంటలను సాగు చేసి నీటిని, డబ్బును, సమయాన్ని, విద్యుత్ శక్తిని ఆదా చేసుకోవాలని అన్నారు. వరి పంట ప్రతి ఒక్కరు వేయడం వల్ల నీరు వృధా పోతున్నాయని, విద్యుత్ శక్తి అధికంగా ఖర్చు అవుతున్నదని అన్నారు. ఉచిత విద్యుత్, పుష్కలమైన నీరు ఉంటే వరి పండించడమే తప్ప ఇతర పంటలపై రైతులు దృష్టి సారించడం లేదని అన్నారు. వరి పండించడం వల్ల ఆక్సిజన్ శాతం తక్కువై ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. అదే ఇతర పంటలు సాగు చేస్తే తగినంత నీరు తగిలి, పంటలు ఏపుగా పెరిగి ఆక్సిజన్ వచ్చేందుకు వీలు ఉంటుందని అన్నారు. ఆక్సిజన్ లేక కరోనా కష్టకాలంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాము మనకు తెలుసని అన్నారు. శాస్త్రవేత్తలు భూమి కి ఎలాంటి పంట వేయాలి, ఏ ప్రాంతంలో ఏ పంట పండుతుంది వారి సూచనల ద్వారా ఈ యసంగి లో ఇతర పంటలు సాగు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గత ఏడాది 9 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఖరీదు చేసిందని, అంతకు ముందు మూడు లక్షల మెట్రిక్ టన్నులు వారిధాన్యం కొనుగోలు చేసిందని, వరి సాగు నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని అన్నారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ శాస్త్రవేత్త ఇల్లిస్ ఖాన్ వాతావరణ మార్పులపై శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రాజేందర్రెడ్డి, మస్తానయ్య, సురేష్ కుమార్, అనిత, భవాని, విజయ్ కుమార్, కృషి విజ్ఞాన కేంద్రం సిబ్బంది, ఎఫ్ పి ఓ రైతులు తదితరులు పాల్గొన్నారు.

…………. జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి జారీ చేయడమైనది.

Share This Post