DPRO KMNR Date:07-07-2021: ప్రెస్ నోట్ & ఫొటోస్: కరీంనగర్ -సదాశివపల్లి మానేరు పై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.శశాంక, మున్సిపల్ కమీషనర్ వల్లూరి క్రాంతి, నగర మేయర్ వై. సునీల్ రావు తదితరులు (కరీంనగర్ జిల్లా)
పత్రికా ప్రకటన
తేదీ :07 -07-2021
కరీంనగర్
కేబుల్ బ్రిడ్జి నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలి
రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్
డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్
000000
కరీంనగర్ లో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ , రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ అన్నారు.
గురువారం కరీంనగర్ -సదాశివపల్లి మానేరు పై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రిన్సిపల్ సెక్రెటరీ పరిశీలించారు. . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ కె మణిహారంగా కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనుల ప్రగతి వివరాలను నిర్మాణ ఏజెన్సీ ని అడిగి తెలుసుకున్నారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని నిర్మాణ సంస్థ ఏజెన్సీని ఆదేశించారు. అనంతరం చింతకుంట లో యాదాద్రి మోడల్ లో ఏర్పాటుచేసిన బృహత్ పట్టణ ప్రకృతి వనాన్ని ప్రిన్సిపల్ సెక్రెటరీ సందర్శించి హరితహారం ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు . పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక, నగర మేయర్ వై .సునీల్ రావు, నగర పాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్, నగరపాలక సంస్థ ఎస్ఈ కృష్ణారావు ఈఈ రామన్ తదితరులు పాల్గొన్నారు.
సహాయ సంచాలకులు జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ చే జారీ చేయడమైనది