పత్రికా ప్రకటన తేది:24 7 2021
వనపర్తి.
పచ్చదనం ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించి మొక్కలు విరివిగా నాటి, వాటిని సంరక్షించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
శనివారం వనపర్తి పట్టణంలోని ఎనిమిదో వార్డులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లు నిండుకున్నాయి, భూగర్భ జల మట్టం కూడా పెరిగిందన్నారు. దీంతో తేమశాతం ఎక్కువై మొక్కలు కూడా పెరుగుతాయని, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడం వల్ల భవిష్యత్తు తరాలకు పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యవంతమైన గాలి ప్రజలకు అందుతుందని ఆయన అన్నారు. రాష్ట్రప్రభుత్వం హరితహారం అనే కార్యక్రమాన్ని చేపట్టి దేశంలోనే కాక ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు సాధించిందన్నారు.
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస్ పూర్, 8వ వార్డులో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, మంత్రితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం శ్రీనివాస్ పూర్ లో కేటీఆర్ జన్మదినం సందర్భంగా మంత్రి కేక్ కట్ చేశారు. అదే విధంగా జిల్లా కలెక్టర్ సి వి రామన్ కళాశాల అవరణలో, ఎకో పార్క్ లో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ,ఎస్పీ అపూర్వ రావు, ఏ ఎస్ పి షాకీర్ హుస్సేన్ అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) అంకిత్, డి ఆర్ డి ఓ, డి ఎఫ్ ఓ, డి పి ఓ, డి ఏ ఓ, ఆర్ డి ఓ అమరేందర్, ఫారెస్ట్ కన్సర్వేటర్ క్షితిజ, జిల్లా పర్షద్ చైర్మన్ లోకనాథరెడ్డి వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, అధికారులు, డి ఎఫ్ ఓ రామకృష్ణ మున్సిపల్ కమిషనర్ వార్డ్ కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.
………….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.