27-08-2021దేవరకొండ,మర్రి గూడ,ఆగస్ట్ 27.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల కు సంబందించి రికార్డులు అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు

శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,ఈ.జి.యస్.స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ మురళి,జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి దేవరకొండ మండలం కొండ భీమన పల్లి,తాటి కోల్ గ్రామాలలో ఉపాధి హామీ కింద చేపట్టి పూర్తి చేసిన పనులు పరిశీలించి అధికారులు, లబ్ది దారులకు సూచనలు చేశారు.
రేపు శనివారం,ఆదివారం,ఆగస్ట్ 28,29 తేదీలలో దేవరకొండ,మర్రిగూడ మండలం లలో కేంద్ర అధికారుల బృందం పర్యటించి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా  చేపట్టిన పనులు, ఉపాధి హామీ పనులు పరిశీలించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులు పరిశీలించారు. దేవర కొండ మండలం కొండ భీమన పల్లి గ్రామం లో  ఈ. జి.యస్ కింద  మంజూరై చేపట్టిన కాటమాని పర్వతాలు  కూరగాయల పందిరిని పరిశీలించారు.దొండ పండిస్తున్న రైతు తో మాట్లాడి ఎంత దిగుబడి వస్తుంది,మార్కెటింగ్, ఎంత రేట్ ఉంది,ఆదాయం ఎంత వస్తుంది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.తర్వాత తాటికోల్ గ్రామం లో ఈ.జి.యస్ ద్వారా తాటికోల్ నుండి అలం పల్లి నర్సింహ పొలం వరకు చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్, మొక్కల పెంపకం నిర్వహణ పరిశీలించారు. అదే గ్రామం లో ఉపాధి హామీ కింద  పూడిక తీసిన చెరువు ను ట్రాక్టర్ పై పరిశీలించారు. అనంతరం మర్రి గూడ ఎం.పి.డి.ఓ కార్యాలయం లో అధికారులతో సమావేశం నిర్వహించారు.కేంద్ర అధికారుల బృందం సభ్యులు గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉపాధి హామీ పనులు పరిశీలించ నున్నందున అధికారులు పూర్తి సమాచారం తో సిద్ధంగా ఉండాలని,పనులు చేపట్టిన రికార్డులు అప్డేట్ చేయాలని సూచించారు.ఈ సమావేశం లో అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ అపూర్వ్ చౌహన్,డి.ఆర్.డి.ఓ.కాళిందిని,డి.పి.ఓ.విష్ణు,జడ్.పి.సి.ఈ. ఓ.వీరబ్రహ్మ చారి,ఎం.పి.డి.ఓ.యాకుబ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post