పత్రిక ప్రకటన
తేదీ 27.07.2021
రోడ్డు స్వీపింగ్ మిషన్ రహదారి శుభ్రం చేసే వాహనం ను ప్రారంభించిన అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలానాదికారి ముషర్రఫ్ ఫారుఖీ.

జిల్లా లోని మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం లో మంగళవారం ఏర్పాటు చేసిన రోడ్డు స్వీపింగ్ మిషన్(రహదారి శుభ్రం చేసే వాహనం) ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాది కారి ముషారఫ్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తో కలిసి ప్రారంభించారు..
ఈ వాహనం 48 లక్షల రూపాయల తో, 70 హెచ్ పి కేపాసిటి ఇంజన్, 9 వేల లీటర్ల సేకరణ తో గంటకు 6 కిలోమీటర్లు శుభ్రం చేయగల సామార్థ్యం గలదని అన్నారు.

జిల్లా కేంద్రంలోని రహదారులు క్లీన్ అండ్ నీట్ గా ఉండాలన్న ఉద్దేశ్యం తో రెండు వాహనాలను సమకూర్చామని ఇది రెండో వాహనం అని తెలిపారు..
జిల్లా కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ తదితరులు ఉన్నారు.

 

జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post